Newspillar
Newspillar
Tuesday, 26 Mar 2024 18:30 pm
Newspillar

Newspillar

నేషనల్ రిపోర్ట్- దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) మద్యం కుంబకోణానికి సంబందించిన (Delhi Excise Scam Case) మనీలాండరింగ్ కేసులో అరెస్టు వ్యవహారంలో ఇతర దేశాలు జోక్యం చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. జర్మనీ మొన్న ఈ వ్యవహారంపై ప్రకటన విడుదల చేయగా, తాజాగా అమెరికా (America) కూడా ఈ అంశంపై స్పందించింది. దీంతో పరిణామాలను తీవ్రంగా పరిగణించిన భారత్ చర్యలు చేపట్టింది. దిల్లీలోని అమెరికా దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసింది.

అమెరికా రాయబార కార్యాలయం తాత్కాలిక డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ గ్లోరియా బెర్బేనా బుధవారం దిల్లీలోని సౌత్ బ్లాక్లో విదేశాంగ శాఖ కార్యాలయానికి వచ్చారు. కేజ్రీవాల్ అరెస్ట్ అంశానికి సంబందించి సుమారు 30 నిమిషాల పాటు అధికారులతో ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్బంగా భారత్ఆమె దగ్గర తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. దౌత్య సంబంధాలకు సంబందించినంత వరకు ఆయా దేశాలు ఇతరుల సార్వభౌమాధికారం, అంతర్గత వ్యవహారాలను గౌరవించాలని మేం భావిస్తున్నామని నిర్మొహమాటంగా చెప్పింది. తోటి ప్రజాస్వామ్య దేశాల విషయంలో బాధ్యత మరింత ఎక్కువగా ఉంటుందని, లేదంటే సంబంధాలు దెబ్బతింటాయని అధికారులు హచ్చరించారు.

దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టుపై -మెయిల్లో అడిగిన ప్రశ్నకు అమెరికా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి మంగళవారం సమాధానం ఇచ్చారు. భారత్లోని ప్రతిపక్ష నేత అరెస్టుకు సంబంధించిన నివేదికలను నిశితంగా పరిశీలిస్తున్నామని, కేసులో పారదర్శక విచారణను ప్రోత్సహిస్తున్నామని పేర్కొనడంతో కేంద్ర విదేశాంగ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇందులో భాగంగానే అమెరికా రాయబార కార్యాలయం తాత్కాలిక డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ గ్లోరియా బెర్బేనాను బుధవారం దిల్లీలోని సౌత్ బ్లాక్లో విదేశాంగ శాఖ కార్యాలయానికి పిలిపించి అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు సమన్లు జారీ చేశారు.