Newspillar
Newspillar
Thursday, 18 Apr 2024 18:30 pm
Newspillar

Newspillar

పొలిటికల్ రిపోర్ట్- ఆంధ్రప్రదేశ్‌ ప్రజల భవిష్యత్‌ను మార్చే ఎన్నికలిలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu) అన్నారు. ఏబీసీడీ వర్గీకరణ తెచ్చి మాదిగలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కర్నూలు జిల్లా ఆలూరులో నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబు పాల్గొన్నారు.  రాష్ట్రాన్ని జగన్‌ 13లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చి, ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి తీసుకొచ్చారని చంద్రబాబు మండిపడ్డారు. కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తామన్న జగన్.. ప్రత్యేక హోదా తెచ్చారా అని ప్రశ్నించారు.

టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి అధికారంలోకి రాగానే స్థానిక సంస్థలకు ప్రాధాన్యమిస్తామని చెప్పిన చంద్రబాబు.. గ్రామాల్లో సర్పంచ్‌ లకే పూర్తి అధికారం ఇస్తామని హామీ ఇచ్చారు. కేంద్రం సహకారం కూడా రాష్ట్రానికి అవసరమని చెప్పిన చంద్రబాబు.. కేంద్రంలో మళ్లీ వచ్చేది ఎన్డీయే ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో ప్రజల ఆదాయం పెరిగిందా అని ప్రశ్నించిన ఆయన.. విద్యపై పెట్టిన ఖర్చు ఎంత, వచ్చిన ఫలితాలేంటి, వైసీపీ నేతలు దోచింది ఎంత, దాదుచుకున్నది ఎంత అని నిలదీశారు. ఆంధ్రప్రజేశ్ రాష్ట్రంలోనే అత్యంత ధనికుడు జగన్‌ అని చెప్పిన చంద్రబాబు.. ఇష్టానుసారం భూములు దోచుకున్నారని ఆరోపించారు.