EC

ఎన్నికల తేదీలపై కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు

అక్టోబరులో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌

స్పెషల్ రిపోర్ట్- తెలంగాణలో శాసనసభ ఎన్నికల (Telangana Assembly Election) నిర్వహణకు కేంద్ర ఎన్నికల కమీషన్ (ECI) సిద్దమవుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు తేదీలను ఖరారు చేసేందుకు ఈసీ సన్నమవుతోంది. వచ్చే అక్టోబరు రెండో వారంలోగా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణపై అధ్యయనం చేసేందుకు భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌  (Rajiv Kumar) ఆధ్వర్యంలో ముగ్గురు సభ్యుల బృందం తెలంగాణకు రోబోతోంది. ఎన్నికల సంఘం టీం అక్టోబరు మొదటి వారంలో రాష్ట్రానికి వచ్చేందుకు సన్నద్దమవుతోందని తెలుస్తోంది. గతంలో గడువుకు ముందుగానే సీఎం కేసీఆర్‌ (CM KCR) అసెంబ్లీని రద్దు చేయటంతో 2018 అక్టోబరు 6న ఎన్నికల షెడ్యూల్‌ వచ్చింది. 2018 డిసెంబరు 7న పోలింగ్ జరిగింది. 2019 జనవరి 17న ఎమ్మెల్యేలంతా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. దీని ప్రకారం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ప్రస్తుత గడువు 2024 జనవరి 16 వరకు ఉంది.

మరోవైపు ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఇదే గడువు ఉంది. ఇక మిజోరం అసెంబ్లీ గడువు ఈ ఏడాది డిసెంబరు 17 తో ముగియనుంది. తెలంగాణతో పాటు మిగిలిన నాలుగు రాష్ట్రాలకు ఒకే సారి ఎన్నికల షెడ్యూలును ప్రకటించేందుకు ఎన్నికల ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి స్థాయి బృందం రెండు దఫాలు ఆయా రాష్ట్రాల్లో పర్యటిస్తుంది. ఎలక్షన్ షెడ్యూల్‌ ప్రకటించటానికి ముందు ఏర్పాట్లపై అధ్యయనం చేసేందుకు, రెండవసారి నామినేషన్ల గడువు ముగిసిన తరవాత ఈ పర్యటనలు ఉంటాయని అదికారులు చెప్పారు. ఇప్పటికే ఎన్నికల సంఘంలోని ఉన్నతస్థాయి అధికారుల బృందం రాష్ట్రంలో పర్యటించి ఎన్నికల సన్నద్ధత మొదటిదశను పరిశీలించింది. మరోపక్క ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ రాష్ట్రంలో ముమ్మరంగా సాగుతోంది. ఇటీవల ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించిన ఎన్నికల సంఘం.. నవంబరు 4న తుది ఓటర్ల జాబితాను ప్రకటించేందుకు సిద్దమైంది. మొత్తానికి అక్టోబర్ రెండో వారంలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు వెలువడనుందని తెలుస్తోంంది. Telangana Assembly Election 2023


Comment As:

Comment (0)