Theves

భలే దొంగలు.. దొంగతనం చేశాక గుడికి వెళ్లి మొక్కులు

క్రైం రిపోర్ట్- దేవుడు అందరికి దేవుడే. ఆఖరికి దొంగలు కూడా తాము చేసే దొంగతనం ఏ ఆటంకం లేకుండా సక్సెస్ కావాలని భగవంతుడిని వేడుకుంటున్నారు. అంతే కాదు దొంగతనం విజయవంతం ఐతే మొక్కులు కూడా తీర్చుకుంటున్నారు. బెంగళూరు (Bangalore) సమీపంలోని గిరినగర పరిధిలో శ్యామల అనే వృద్ధురాలి గొలుసును ఈనెల 13న మంజునాథ (Manjunatha), యతీశ్‌ (Yateesh) లు చోరీ చేసుకుని పరారయ్యారు. గొలుసు దొంగతనం అనంతరం సమీపంలోని మలెమహదేశ్వర స్వామి గుడికి వెళ్లి, తల నీలాలు ఇచ్చి, హుండీలో కానుకలు వేసి వేసి మొక్కులు చెల్లించుకున్నారు.

గుడికి వెళ్లి, మొక్కు చెల్లించుకుని ఇంటికి వచ్చేసరికి వారి ముందు పోలీసులు ప్రత్యక్షమయ్యారు. గొలుసు చోరీ సమయంలో స్థానిక సీసీ కెమెరా ఫుటేజ్‌ ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. వీరి నుంచి 25 గ్రాముల గొలుసు, మూడు బైకులను స్వాధీనపరుచుకున్నామని గిరినగర ఠాణా పోలీసులు చెప్పారు. దొంగతం చెసిన ప్రతిసారి గుడికి వెళ్లి మొక్కులు చెల్లించుకుంటామని దొంగలు చెప్పారు. పెద్ద దొంగతనం వర్కవుట్ ఐతే కొండకు వచ్చి గుండు కొట్టించుకుంటామని మంజునాథ, యతీశ్‌ చెప్పడం విశేషం.


Comment As:

Comment (0)