Virat

ఒక్క ఇన్ స్టాగ్రామ్ పోస్టుకు 11.45 కోట్లు స్పందిస్తున్న విరాట్ కోహ్లీ

స్పెషల్ రిపోర్ట్- విరాట్ కోహ్లీ (Virat Kohli) సోషల్ మీడియాలో అత్యంత పాపులారిటీ కలిగిన క్రికెటర్. దీంతో విరాట్ ఇన్‌ స్టాగ్రామ్‌ (Instagram) లో ఒక్కో పోస్టుకు 11.45 కోట్లు సంపాదిస్తాడన్న వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. సోషల్ మీడియా ద్వార ఇంత భారీ మొత్తంలో సంపాదిస్తున్న వారి జాబితాలో టాప్‌ 25లో ఉన్న ఏకైక ఇండియన్ విరాట్ కోహ్లీ మాత్రమేనని హాపర్ హెచ్‌ క్యూ అనే సంస్థ పేర్కొంది. ఇంకేముంది విరాట్ క్రికెట్, యాడ్స్ లోనే కాదు, సోషల్ మీడియా పోస్టుల ద్వారా భారీగానే సంపాదిస్తున్నాడని అంతా చర్చించుకుంటున్నారు. ఇదిగో ఇటువంటి సమయంలో తాను ఇన్ స్టాగ్రామ్ లో చేసే పోస్టులతో వచ్చే సంపాదన గురించి విరాట్ కోహ్లీ తాజాగా స్పందించాడు. అందులో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చాడు.

 నా జీవితంలో ఇప్పటి వరకు నేను అందుకొన్న ప్రతి దానికి రుణపడి ఉంటాను.. అందుకోసం ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.. ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సోషల్‌ మీడియా సంపాదన వార్తల్లో ఎలాంటి నిజం లేదు.. అని విరాట్ కోహ్లీ (Virat Kohli) ట్వీట్ చేశాడు. ఇక ఇన్‌ స్టాగ్రామ్‌ లో విరాట్ ఖాతాను ఏకంగా 25 కోట్ల మందికి పైగా ఫాలో అవుతున్నారు. దీంతో ఇన్‌ స్టాగ్రామ్‌లో కోహ్లీకి డిమాండ్‌ ఎక్కువగా ఉంది. ఇన్‌ స్టాగ్రామ్‌ లో ఖరీదైన అథ్లెట్ల జాబితాలో కోహ్లీ మూడో స్థానంలో నిలిచాడని సోషల్ మీడియా బిజినెస్ నిర్వహణ వేదిక హాపర్‌ హెచ్‌ క్యూ తెలిపింది. విరాట్ కోహ్లీ ఇన్ స్టాగ్రామ్ లో ఒక్కో పోస్టుకు 11.45 కోట్ల రూపాయల చొప్పున తీసుకుంటున్నాడని స్పష్టం చేసింది. ప్రపంచ ఫుట్‌బాల్‌ దిగ్గజాలు క్రిస్టియానో రొనాల్డో (Christiano Ronaldo) 599 మిలియన్‌ లతో, మెస్సి (Messi) 482 మిలియన్‌ లతో విరాట్ కోహ్లీ కంటే ముందున్నారు. ఇన్ స్టాగ్రామ్ లో ఒక్కో పోస్టు కోసం రొనాల్డో 26.76 కోట్లు, మెస్సి 21.49 కోట్లు సంపాదిస్తున్నారట. ఇదన్నమాట సంగతి.


Comment As:

Comment (0)