News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

మోదీ ఫాలోవర్ పై పోలీస్ కేసు

ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కూతురిపై ఓ వ్యక్తి ఆన్‌లైన్‌లో లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఆమెపై అత్యాచారం చేస్తానంటూ సదరు వ్యక్తి ట్వీట్టర్ లో బెదిరించాడు. ప్రధాని మోదీ ట్విట్టర్ ఫాలోవర్లలో ఈ వ్యక్తి ఉన్నాడు. ప్రధాని మోదీ అనుచరుడిగా చెప్పుకుంటున్న అతడి ట్విట్టర్ ఖాతా పేరు చౌకీదర్ రాంసంగి. మోదీపై విమర్శలు ఆపమని మీ నాన్నకు చెప్పు.. లేదంటే…. జై శ్రీరామ్అం.. టూ చౌకీదార్ రాంసంగి కశ్యప్ కూతురికి అసభ్యకరంగా ట్వీట్ చేశాడు. ఈమేరకు అనురాగ్ కశ్యప్ ప్రధాని మోదీకి ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు.

- Advertisement -

డియర్ నరేంద్ర మోదీ సర్.. మీరు మరోసారి గెలిచినందుకు అభినందనలు.. కలుపుగోలు తనానికి కృతజ్ఞతలు.. సర్, ఒక్క విషయం.. మీ ఫాలోవర్లతో ఎలా ప్రవర్తించాలో మాకు కాస్త తెలియజేయండి.. ఎందుకంటే, లైంగికపరమైన బెదిరింపులతో నా కూతురిని బెదిరిస్తూ కొందరు మీ విజయాన్ని జరుపుకుంటున్నారు.. బహుశా నేను మీ అసమ్మతి వాదినని భావిస్తున్నారేమో.. అని చౌకీదార్ రాంసంగి అనే వ్యక్తి ట్వీట్‌ను రీట్వీట్ చేసిన అనురాగ్ పై విధంగా ట్విట్టర్ లో పేర్కొన్నారు. అంతే కాదు తన కూతురిని బెదిరిస్తున్న నిందితుడిని అరెస్ట్ చేసి తగిన చర్యలు తీసుకోవాలని ముంబై పోలీసులను కశ్యప్ కోరారు. దీనికి స్పందించిన ముంబయి పోలీసులు సదరు వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.