News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

ఏపీ అసెంబ్లీలో వాళ్ళిద్ద‌రు సెంట్రాఫ్ అట్రాక్ష‌న్

అమ‌రావ‌తి- వాళ్లిద్దరూ బాబాయ్ అబ్బాయ్. ఎన్నికల్లో ఇద్దరూ భారీ మెజార్టీ సాధించారు. ఒకే సారి అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్నారు. అవును  ఈ దృశ్యం ఏపీ అసెంబ్లీలో  ద‌ర్శ‌నం ఇవ్వ‌బోతుంది. శ్రీశైలం , నంద్యాల నియోజ‌క‌వ‌ర్గాల‌నుండి గెలిచిన , శిల్పా చక్రపాణిరెడ్డి, శిల్పా రవి చంద్రకిశోర్ రెడ్డి లు ఇద్ద‌రు భాబాయ్ -అబ్బాయ్ లు. ఏప్రిల్ 11న జరిగిన ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో బుడ్డా, భూమా, శిల్పా కుటుంబాలు హోరాహోరీగా తలపడ్డాయి. ఉత్కంఠ భ‌రితంగా సాగిన పోరులో.. చివరకు శిల్పా ఫ్యామిలీ విజయం సాధించింది. నంద్యాల ఎమ్మెల్యేగా గెలిచిన శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి, శ్రీశైలం నుంచి గేలిచిన శిల్పా చక్రపాణిరెడ్డి.. ఈ ఇద్ద‌రు తొలిసారి అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు. నంద్యాల ఎమ్మెల్యేగా 2004, 2009 ఎన్నికలో గెలిచిన శిల్పా మోహన్ రెడ్డి ఈ ఎన్నికలో తన  వారసుడు రవిచంద్ర కిశోర్‌ రెడ్డిని బరిలో దించి సక్సెస్ అయ్యారు. అటు శ్రీశైలం నుండి.. త‌మ చిర‌కాల ప్ర‌త్యర్తి అయిన‌ బుడ్డా రాజశేఖర్‌రెడ్డిపై మోహ‌న్ రెడ్డి సోద‌రుడు.. చక్రపాణిరెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించారు.

ap_assembly,ap cm,shilpa mohan reddy

- Advertisement -

వైఎస్సార్ మరణానంతరం శిల్పా సోద‌రుల్లో..  చక్రపాణిరెడ్డి జగన్ వెంట నడవ‌గా… శిల్పా మోహన్ రెడ్డి కాంగ్రెస్ లోనే ఉండిపోయారు. 2014 ఎన్నికలకు ముందు బుడ్డా కుటుంబం టీడీపి వీడి వైసీపీలో చేరింది. శ్రీశైలం నుంచి బుడ్డా రాజశేఖర్ రెడ్డికి టికెట్ ఖరారు అవ్వడంతో ఆ  సీటు ఆశించిన శిల్పా చక్రపాణిరెడ్డి వైసీపీ వీడి టీడీపీలో చేరారు. టీడీపీలో రెండు సార్లు ఎమ్మెల్సీగా, పార్టీ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించారు చ‌క్ర‌పాణి రెడ్డి. 2014 ఎన్నికల సమయానికి తన సోదరుడు శిల్పా మోహన్ రెడ్డి కూడా టీడీపిలో చేరడంతో ఇద్దరూ శ్రీశైలం, నంద్యాల  నుంచి పోటీ చేసి ఓడిపోయారు. భూమా నాగిరెడ్డి మరణించడంతో ఉప ఎన్నిక టికెట్ ను శిల్పా మోహన్ రెడ్డి ఆశించారు. భూమా కుటుంబానికే టికెట్ ఇవ్వడంతో శిల్పా మోహన్ రెడ్డి టీడీపి వీడి వైసీపీలో చేరారు. అధికార పార్టీ అభ్యర్థితో తలపడ్డారు. అన్నకు తోడుగా  తమ్ముడు చక్రపాణిరెడ్డి సైతం టీడీపికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. ఓటమి ఎదురైనా అన్నదమ్ములు నిరుత్సాహం పడకుండా నంద్యాల, శ్రీశైలం నియోజకవర్గాల్లో పట్టు బిగించారు. ఈ సారి ఎన్నిక‌ల్లో గ‌ణ విజ‌యం సాదించిన .. ఈ బాబాయ్ -అబ్బాయ్ లు అసెంబ్లీలో క‌లిసి అడుగు పెడుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.