News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

మట్టి గణపతి విగ్రహాలపై ప్రజల్లో పెరుగుతున్న ఆసక్తి ..!

హైదరాబాద్ : ఒకప్పుడు రసాయనాలతో తయారైన మట్టి విగ్రహాలను తయారుచేసే సంస్థలు పర్యావరణ హిత మట్టి విగ్రహాలకు నేడు జైకొడుతున్నారు.  కలర్ ఫుల్ గా .. మెరిసిపోతూ పెయింటింగ్ తో ఉండే వినాయక విగ్రహాలు అందరినీ ఎట్రాక్ట్ చేస్తాయి. కానీ .. వీటివల్ల మన ఆరోగ్యానికి హాని కలుగుతుంది. కాబట్టి వాటికి దూరంగా ఉండటమే మంచిది. వీటికి బదులుగా మట్టి గణపతులు ఎకో ఫ్రెండ్లీగా ఉంటాయి. గతంతో పోలిస్తే మట్టిగణపతులకు ఆదరణ పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో మట్టి గణపతుల పంపిణీ మహా ఉద్యమంగా సాగుతోంది.  హైదరాబాద్ మహానగరవాసులు మట్టి గణపతికి సలాం చేస్తున్నారు. ఇళ్లలో పూజించే 10 నుంచి 20అంగుళాల ప్రతిమలు మొదలు .. మండపాల్లో 10-60అడుగుల వరకు ఏకో ఫ్రెండ్లీ విగ్రహాలను ప్రతిష్టిస్తున్నారు.

Ganesh

ఇది భక్తుల్లో పెరుగుతున్న పర్యావరణ స్పృహ‌‌కు నిదర్శనమని పర్యావరణవేత్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తే ఎక్కువమంది మట్టి గణపతులను పూజించేందుకు ముందుకు రావడం ఖాయం.  మట్టి గణపతి .. మహా గణపతి అంటూ మహానగరంలో ఏకో ఫ్రెండ్లీ ప్రతిమల పంపిణి ఐదారేళ్ళ క్రితమే ప్రారంభం అయింది. అప్పటి నుంచి ప్రతి ఏటా వేల సంఖ్యలో విగ్రహాలను భక్తులకు ఉచితంగా అందచేస్తున్నాయి జీహెచ్ఎంసీ .. కొన్ని స్వచ్ఛంద సంస్థలు .. హెచ్‌ఎండీఏ వంటి ప్రభుత్వ విభాగాలు. ఈ ఏకో ఫ్రెండ్లీ విగ్రహాలపై క్యాంపెయిన్‌లను నిర్వహిస్తున్నాయి. వీటన్నింటి నేపథ్యంలో మట్టి గణపతులను ఎక్కువగా పూజిస్తుండడం ఆహ్వానించదగ్గ పరిణామంగా చెప్పాలి. ఈ ఏడాది కూడా లక్షలాది మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.  మట్టి గణపతులను భారీ స్థాయిలో నెలకొల్పి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు కర్నూలు వాసులు. కర్నూలు నగరంలో గతేడాది 51 అడుగుల మట్టి మహాగణపతిని ప్రతిష్ఠించగా.. ఈ ఏడాది 65 అడుగుల విగ్రహాన్ని సిద్ధం చేశారు.

- Advertisement -

Ganesh

కోల్‌కతాకు చెందిన కళాకారులు 65 రోజులపాటు శ్రమించి ఈ విగ్రహాన్ని తయారు చేశారు. ఈ విగ్రహాన్ని నెలకొల్పిన చోటే నీరు వెదజల్లి నిమజ్జనం చేసేలా తుంగభద్ర నది ఒడ్డున ప్రతిష్ఠించారు. పర్యావరణ హితం కోరుతూ .. ప్రజల్లో అవగాహన కల్పించేలా విగ్రహాన్ని రూపొందించి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. మీరు కూడా మట్టి విగ్రహాలను ప్రతిష్టించండి. పర్యావరణానికి మేలు చేకూర్చండి.

Ganesh

Leave A Reply

Your email address will not be published.