News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

కేసీఆర్ పై కడియం అసంతృప్తి ..

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఎప్పుడు ఏ నాయ‌కుడిని అంద‌లం ఎక్కిస్తారో, ఎప్పుడు ఎవ‌రిని ప‌క్క‌న పెట్టేస్తారో అంచ‌నా వేయ‌డం క‌ష్టం. కరెక్ట్ గా కడియం శ్రీహరి విషయంలోనూ ఇదే జరిగింది. గ‌త ప్ర‌భుత్వంలో పార్టీలో .. ప్ర‌భుత్వంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన క‌డియం శ్రీహ‌రిని ఇప్పుడు కేసీఆర్ పూర్తిగా ఇంటికే ప‌రిమితం చేసేశారు. దీంతో ఇక టీఆర్ఎస్‌లో ఉండ‌టం అవ‌స‌ర‌మా అనే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

Kadiyam

ఇక వివరాల్లోకి వెళితే .. నాలుగేళ్ల పాటు ఉప ముఖ్య‌మంత్రిగా విద్యాశాఖ బాధ్య‌త‌లు చూసిన క‌డియం శ్రీహ‌రి గ‌త ప్ర‌భుత్వంలో క్రీయాశీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. వ‌రంగ‌ల్ జిల్లా టీఆర్ఎస్ పార్టీని క‌డియం శాసించారు. క‌డియం రాష్ట్ర మంత్రివ‌ర్గంలోకి రావ‌డంతో ఆయ‌న స్థానంలో ప‌సునూరి ద‌యాక‌ర్‌ను టీఆర్ఎస్ ఉప ఎన్నిక‌ల్లో నిల‌బెట్టింది. అయితే, గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో క‌డియం శ్రీహ‌రి త‌న రాజ‌కీయ వార‌సురాలిగా ఆయ‌న కూతురు క‌డియం కావ్య‌ను తీసుకురావాల‌నుకున్నారు. ఆమెను స్టేష‌న్ ఘ‌న్‌పూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయించాల‌నుకున్నారు. టిక్కెట్ కోసం తీవ్రంగా ప్ర‌య‌త్నించారు. ఒకానొక స‌మ‌యంలో టిక్కెట్ కోసం అనుచ‌రుల‌తో ఆందోళ‌న కూడా చేయించారు. అయితే, కేసీఆర్ మాత్రం మ‌రోసారి సిట్టింగ్ ఎమ్మెల్యే రాజ‌య్య‌కే ఈ టిక్కెట్ ఇచ్చారు. ఇక‌, వ‌రంగ‌ల్ ఎంపీ టిక్కెట్‌ను మ‌రోసారి ప‌సునూరి ద‌యాక‌ర్‌కు ఇచ్చారు. దీంతో తండ్రికూతుళ్లు ఇద్ద‌రికీ పార్టీ టిక్కెట్లు ద‌క్క‌లేదు.

- Advertisement -

Kadiyam

ఇక ఎన్నిక‌ల త‌ర్వాత ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావుకు క్యాబినెట్‌లో చోటు ద‌క్కింది. దీంతో ఇప్పుడు ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు జిల్లా పార్టీలో కీ రోల్ ప్లే చేస్తున్నారు. క‌డియంకు టిక్కెట్ ద‌క్క‌క‌పోవ‌డం, పార్టీలోనూ ప్రాధాన్య‌త క‌రువు కావ‌డంతో ఆయ‌న రాజ‌కీయంగా యాక్టీవ్‌గా లేరు. అయితే .. టీఆర్ఎస్ త‌మ నేత‌ను అవ‌మానిస్తోంద‌నే భావ‌న ఆయ‌న అనుచ‌రుల్లో ఉంది. దీంతో ఇంకా టీఆర్ఎస్‌లోనే కొన‌సాగాలా లేదా అనే ఆలోచ‌న‌లో క‌డియం ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఆయ‌న బీజేపీలో చేరే అవ‌కాశాలు ఉన్నాయ‌ని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఇప్పుడీకిప్పుడే నిర్ణయం లేకున్నా .. భవిష్యత్ రాజకీయాల్లో ఆయన కమలం గూటికి చేరడం ఖాయమని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

Tags: HARISH RAO, KAVITHA,BJP, CONGRESS, KADIYAM SRIHARI, GOING TO JOI

 

Leave A Reply

Your email address will not be published.