icc world cup 2023

వరల్డ్ కప్ 2023 షెడ్యూల్

వరల్డ్ కప్ 2023 షెడ్యూల్ – భారత్-పాక్ మ్యాచ్ అప్పుడే

స్పోర్ట్స్ డెస్క్- క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రపంచ కప్‌ (World Cup 2023) షెడ్యూల్ ను ప్రకటించింది ఐసీసీ. భారత్‌ లో అక్టోబర్‌ నవంబర్‌ మధ్య జరగనున్న ఈ మెగా టోర్నీలో మ్యాచ్‌ ల షెడ్యూల్‌ ను ఐసీసీ (ICC) విడుదల చేసింది. అక్టోబర్‌ 5న అహ్మదాబాద్‌ వేదికగా ఇంగ్లాండ్, న్యూజిలాండ్‌ జట్ల మధ్య మ్యాచ్‌ తో ఈ ప్రపంచ కప్ ప్రారంభమవుతుంది. లీగ్‌ దశలో టీమ్‌ ఇండియా (Team India) మొత్తం 9 మ్యాచ్‌లు ఆడనుంది. అక్టోబర్‌ 8న ఆస్ట్రేలియాతో భారత్‌ తన తొలి మ్యాచ్‌ లో పోటీపడనుంది. అహ్మదాబాద్‌ వేదికగా అక్టోబర్‌ 15న ప్రత్యర్థులైన భారత్‌, పాక్‌ మ్యాచ్‌ ఉండనుంది.

నవంబర్‌ 15, 16న ముంబయి, కోల్‌కతా వేదికగా సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లు, అహ్మదాబాద్‌ వేదికగా నవంబర్‌ 19న ఫైనల్‌ మ్యాచ్‌ ఉంటుందని ఐసీసి తెలిపింది. రెండు సెమీ ఫైనల్స్‌తో పాటు ఫైనల్‌ మ్యాచ్‌ కు నవంబర్ 20న రిజర్వ్‌ డే గా ఉంది. పుణె, ముంబయి, అహ్మదాబాద్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, ధర్మశాల, దిల్లీ, లఖ్‌ నవూ వేదికలుగా ప్రపంచ కప్ మ్యాచ్‌ లు జరగనున్నాయి. ఇక మన హైదరాబాద్‌ మొత్తం మూడు మ్యాచ్‌ లకు ఆతిథ్యం ఇవ్వబోతోంది. పాకిస్థాన్ (Pakistan).. చెన్నై, బెంగళూరు వేదికలు తమకు అనుకూలంగా లేవంటూ అభ్యంతరం వ్యక్తం చేసినా ఐసీసీ దానిని ఏ మాత్రం పరిగణలోకి తీసుకోలేదు.  

వరల్డ్ కప్ లో భారత్ ఆడే మ్యాచ్ లు..

అక్టోబర్ 8- చెన్నైలో- ఆస్ట్రేలియాతో

అక్టోబర్ 11- ఢిల్లీలో- అఫ్ఘనిస్తాన్ తో

అక్టోబర్ 15- అహ్మదాబాద్ లో- పాకిస్థాన్ తో

అక్టోబర్ 19- పూణె లో- బంగ్లాదేశ్ తో

అక్టోబర్ 22- ధర్మశాల లో- న్యూజీలాండ్ తో

అక్టోబర్ 29- లఖ్ నవూ లో- ఇంగ్లండ్ తో

నవంబర్ 2- ముంబయి లో-క్యాలిఫయర్-2 తో

నవంబర్ 5- కోల్ కతాలో- దక్షిణాఫ్రికా తో

నవంబర్ 11- బెంగళూరులో- క్వాలిఫయర్-1 తో


Comment As:

Comment (0)