News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

బీజేపీలో జ‌న‌సేన విలీనానికి చ‌ర్చ‌లు ..!

జెండా పీకేద్దాం .. ఈ డైల‌గ్ గుర్తుందా .. చిరంజీవి స్థాపించిన‌ ప్ర‌జారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనానికి కొద్ది నెల‌ల ముందు ఓ ప్ర‌ధాన వార్త ప‌త్రిక‌లో వ‌చ్చిన వార్త ఇది. ఇప్పుడు క‌ర్టెక్ట్ గా మ‌ళ్ళీ అదే త‌ర‌హ వార్త మ‌రో రాజ‌కీయ పార్టీ గురించి రాబోతుంద‌నే చ‌ర్చ బ‌లంగా జ‌రుగుతోంది. ఇంత‌కీ ఏదా పార్టీ అనుకుంటున్నారా .. ఇంకెవ‌రిది .. చిరు సోద‌రుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్థాపించిన జ‌న‌సేన పార్టీ. త‌మ్ముడు ప‌వ‌న‌క క‌ళ్యాణ్ కూడా అన్న‌య్య బాట‌లోనే న‌డవ‌బోతున్నార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. చిరు జాతీయ పార్టీ కాంగ్రెస్ ను ఎంచుకుంటే .. త‌మ్ముడు క‌ళ్యాణ్ మ‌రో జాతీయ పార్టీ బీజేపీని ఎంచుకోబోతున్నాడ‌ట‌.

JANASENA

అస‌లు ఏం జ‌రుగుతుంద‌నే వివ‌రాల్లోకి వెళితే .. ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌న‌సేన పార్టీని ఈజేపీలో విలీనానికి నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం ప‌వ‌న్ అమెరికా టూర్ లో రామ్ మాధ‌వ్ ప‌వ‌న్ మ‌ద్య ర‌హ‌స్య మంత‌నాలు జ‌రిగాయ‌ట‌. ఈ భేటిలో ప‌వ‌న్ త‌న‌కు కావ‌ల్సిన అన్ని అంశాల‌పై బీజేపీ నుంచి హామీ పొందిన‌ట్లు స‌మాచారం. జ‌న‌సేన బీజేపీ లో విలీనానికి తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ మ‌ద్య‌వ‌ర్తిత్వం చేసిన‌ట్లు తెలుస్తోంది. ఇక తాజాగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ .. నాదేండ్ల మ‌నోహ‌ర్ తో క‌లిసి మ‌రో ద‌ఫా న‌ర‌సింహ‌న్ తో భేటి కావ‌డం చ‌ర్చ నీయాంశ‌మైయ్యింది.

JANASENA

- Advertisement -

తుది ద‌శ చ‌ర్చ‌ల్లో భాగంగానే ప‌వ‌న్ క‌ళ్యాణ్ గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ స‌మావేశ‌మైయ్యార‌ని స‌మాచారం. ఆంద్ర‌ప్ర‌దేశ్ లో పాగా వేయాల‌ని పావులు క‌దుపుతున్న బీజేపీ దానిక‌నుగుణంగా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటుంది. కాపు సామాజిక వ‌ర్గానిక చెందిన ప‌వ‌న్ ను పార్టీలో చేర్చుకుంటే .. ఏపీలో బ‌ల‌మైన పునాదులు ఏర్ప‌రుచుకోవ‌చ్చ‌నే వ్యూహంతో కాషాయ నేత‌లున్నారు. అన్ని అనుకున్న‌ట్లు జ‌రిగితే .. మ‌రి కొద్ది రోజుల్లో విలీన ప్ర‌క్రియ వార్త‌ను వినాల్సిందే.  మొన్న‌టి వ‌ర‌కున ఈతి సూక్తులు చెప్పిన ప‌వ‌న్ .. అన్న అప్పుడు  కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ లో విలీనం చేస్తే .. త‌మ్ముడు కూడా  అన్న త‌ర‌హాలోనే .. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో విలీనానికి త‌హ‌త‌హ‌లాడుతున్నాడు.

JANASENA

Tags: JANASENA,PAWAN KALYAN,CHIRANJEEVI,NADENDLA MANOHAR,BJP,NARENDRA MODI,AMITH SHA, JANASENA MERGER,CONGRESS,GOVERNOR NARASIMHAN,PAWAN KALYAN MET GOVERNOR NARASIMHAN,YSRCP,AP CM JAGAN MOHAN REDDY,AP,AMARAVATHI,VIJAYAWADA

Leave A Reply

Your email address will not be published.