News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

కాలర్ ఎగరేసిన మహేష్ బాబు

మహేష్ బాబు కాలర్ ఎగరేశారు. మహర్షి విజయంతో ఆయన ఈ పని చేశారు. ఆదివారం నాడు ‘మహర్షి’ సక్సెస్ మీట్ జరిగింది. అందులో మహేష్ బాబు మాట్లాడుతూ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు వంశీ పైడిపల్లి తన అభిమానులు కాలర్ ఎత్తుకుని తిరిగేలా సినిమా ఉంటుందని అన్నారు. వాళ్ళు కాలర్ ఎత్తుకున్నారు వంశీ. నేను కూడా కాలర్ ఎత్తుతున్నా అంటూ కాలర్ ఎగరేశారు మహేష్. మహేష్ నుంచి ఈ తరహా స్పందన ఇదే మొదటి సారి కావటం విశేషం. ఈ సినిమా మహేష్ కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన 25వ సినిమా కావటం విశేషం. పదరా పదరా పాట చూసినప్పుడల్లా నాకు కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి. తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్స్ ను మహర్షితో వారం రోజుల్లో దాటేయనున్నట్లు మహేష్ బాబు ధీమా వ్యక్తం చేశారు. అల్లరి నరేష్ మాట్లుడుతూ తన కెరీర్ లో హిట్ అన్న మాట విని నాలుగు సంవత్సరాలు అయిందని అన్నారు.

- Advertisement -

మహర్షిలో ఇంత మంచి క్యారెక్టర్ ఇఛ్చినందుకు దర్శకుడు వంశీ, మహేష్ బాబుకు నరేష్ ధన్యవాదాలు తెలిపారు. ఈ రోజు తన తండ్రి ఈవీవీ సత్యనారాయణ ఉండి ఉంటే ఎంతో సంతోషించేవారని వ్యాఖ్యానించారు. సక్సెస్ మీట్ లో పాల్గొన్న వారంతా భావోద్వేగ ప్రసంగాలు చేశారు  పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ.. దర్శకుడు వంశీ పైడిపల్లి టేకింగ్ హాలీవుడ్ స్థాయిలో ఉంటుందంటూ కితాబిచ్చారు. నేనే గనక ఆడపిల్లనైతే మహేష్‌ బాబు పెళ్లి చేసుకునే వరకు వదిలిపెట్టే వాడిని కాదంటూ నవ్వులు పూయించారు. మహేష్ అందం చూస్తే మొగాళ్లకు అసూయ కలుగుతుందంటూ ఆకాశానికెత్తేశారు. మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందించాడు.

 

Leave A Reply

Your email address will not be published.