mrunal thakur

లస్ట్‌ స్టోరీస్‌2 సిరీస్ లో వేద గా నటించిన మృణాల్‌

శృంగారం గురించి మాట్లాడటానికి సిగ్గెందుకంటున్న మృణాల్

సినిమా డెస్క్- మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur).. ఈ పేరు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సీతారామం (Seetharamam) సినిమాలో తన అందం, నటనతో అందరిని ఆకట్టుకుందీ భామ. ఇక అంతకు ముందు 2018లో మృణాల్ ఠాకూర్ నటించి నెట్‌ ఫ్లిక్స్‌లో విడుదలైన లస్ట్‌ స్టోరీస్‌ మంచి విజయం సాధించింది. ఇదిగో ఇప్పుడు ఆ సిరీస్ కు కొనసాగింపుగా లస్ట్ స్టోరీస్‌ 2 వచ్చింది. ఈ సిరీస్ లో మృణాల్‌ ఠాకూర్‌ తో పాటు తమన్నా కాజోల్‌ వంటి సీనియర్ హీరోయిన్స్ నటించారు. లస్ట్‌ స్టోరీస్‌ 2 జూన్‌ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సీరిస్‌ ముఖ్యంగా యువతనే టార్గెట్‌ చేసేకధాంశతో రూపొందించారు.   

లస్ట్‌ స్టోరీస్‌2 సిరీస్ లో వేద గా నటించిన మృణాల్‌ ఠాకూర్‌, అర్జున్‌ గా నటించిన అంగద్‌ బేడీ బాగా మెప్పించారు. వేద బామ్మగా నటించిన సీనియర్ నటి నీనా గుప్త క్యారెక్టర్‌ కూడా ఆకట్టుకుంటుంది. జీవితాంతం సుఖంగా ఉండాలంటే పెళ్లికి ముందు శృంగార జీవితాన్ని రుచి చూడాలనే సలహాను వేద బామ్మఇవ్వడంతో సీరిస్‌ కు హైలెట్ అని చెప్పవచ్చు. శృంగారం, కామం గురించి పరిణతి చెందిన సంభాషణ చేయడంలో తప్పులేదంటూ మృణాల్‌ ఠాకూర్‌ ఈ సీరిస్‌ గురించి చెప్పుకొచ్చింది. 

ఈ రోజుల్లో శృంగారం, కామం గురించి ప్రతి ఇంట్లో ఓపెన్‌ గా సంభాషణలు జరగడం ఎంతో ముఖ్యమని తాను బలంగానమ్ముతానని మృణాల్ ఠాకూర్ చెప్పింది. ప్రధానంగా ఇంట్లో యుక్త వయసులో ఉన్న వాళ్లతోదీనిపై మాట్లాడటం అవసరమని, వాళ్లకు వీటి గురించి సరైన సమాచారం అందించే ఓ రోల్మోడల్ కావాలని తెలిపింది. శృంగారం వంటి టాపిక్స్ పై ఇంట్లోని పిల్లలకు నిజాయితీగావివరించే ఒక్క వ్యక్తి ఉన్నా కూడా వాళ్లు బయట నుంచి వచ్చే తప్పుడు సమాచారాన్ని స్వీకరించరని మృణాల్ ఠాకూర్ తన అభిప్రాయాన్ని చెప్పింది.


Comment As:

Comment (0)