News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

నానిస్ గ్యాంగ్ లీడర్ రివ్యూ

సినిమా- నానిస్ గ్యాంగ్ లీడర్
తారాగణం- నాని, ప్రియాంక‌, కార్తికేయ గుమ్మ‌కొండ‌, ల‌క్ష్మీ, శ‌రణ్య, శ్రియారెడ్డి, ప్రాణ్య‌, అనీష్ కురువిల్లా, వెన్నెల కిషోర్‌, స‌త్య‌, ర‌ఘుబాబు, ప్రియ‌ద‌ర్శి త‌దిత‌రులు

మ్యూజిక్-  అనిరుధ్‌

కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం- విక్రమ్‌ కె.కుమార్‌.

పరిచయం……….
నాని తెలుగు సినిమా ఇండస్త్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. చెసింది తక్కువ సినిమాలే అయినా కధల ఎంపికలో నాని డిఫరెంట్ అనే మార్క్ పడింది. నాని నటించిన చాలా వరకు సినిమాలు సక్సెస్ అయ్యాయంటే అందుకు నాని ఎంచుకున్న కధలే కారణమని ఇట్టే చెప్పేయవచ్చు. ఇక జెర్సీ లాంటి ఎమోషనల్ సినిమా తరువాత నాని ఒక డిఫరెంట్ కధతో మన ముందుకు వచ్చాడు. అదే నానీస్ గ్యాంగ్ లీడర్. ఇష్క్‌, మ‌నం సినిమాల ఫేమ్ విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మరి నాని`స్ గ్యాంగ్‌లీడ‌ర్‌ సినిమా ఎలా ఉందో తెలుసుకుందామా…….

nanis gangleader

- Advertisement -

సినిమా కధ……….

ఇక సినిమాలోకి ఎంటర్ ఐతే.. పెన్సిల్ పార్ధసారధి (నాని) డబ్బింగ్ సినిమాల రతనలు చేస్తుంటాడు. హాలీవుడ్ సినిమాలు చూసి.. వాటిని కాపి కొట్టి తెలుగులో కధలు రాస్తుంటాడు. ఈ క్రమంలో నాని డబ్బింగ్ రచయితగా మంచి పేరు సంపాదించుకుంటాడు. ఈ క్రమంలో నగరంలో ఓ రోజు బ్యాంకు దోపీడీ జ‌రుగుతుంది. మొత్తం ఆరుగురు కలిసి బ్యాంక్ దోపిడికి పాల్పడతారు. బ్యాంకులో డ‌బ్బు దోచుకున్న త‌ర్వాత ఆరుగురులో ఒక‌డు మిగిలిన ఐదు మందిని చంపేస్తాడు.ఈ బ్యాంకు దోపిడి చేసిన వాడు పోలీసులు ఎంత ప్ర‌య‌త్నించినా దొర‌క‌డు. ఈ క్రమంలో స‌రస్వ‌తి (ల‌క్ష్మి).. మ‌ధ్య‌వ‌య‌స్కురాలైన వ‌ర‌ల‌క్ష్మి (శ‌రణ్య‌), పెళ్లి కాబోతున్న అమ్మాయి ప్రియ‌ (ప్రియాంక‌), స్కూల్ చ‌దువుతున్న అమ్మాయి స్వాతి (శ్రియారెడ్డి), ఐదేళ్ల పాప (పాణ్య‌)ల‌కు బహుమ‌తి వ‌చ్చింద‌ని అబ‌ద్ధం చెప్పి ఇంటికి ర‌ప్పిస్తుంది. బ్యాంకు రాబ‌రీలో ఆరోవాడు త‌మ‌కు కావాల్సిన ఐదుగురుని చంపేశాడు కాబ‌ట్టి.. వాడెవ‌డో క‌నిపెట్టి ప‌గ తీర్చుకుందామ‌ని చెబుతుంది. ముందు ఒప్పుకోక‌పోయినా త‌ర్వాత అంద‌రూ ఒప్పుకుంటారు. అయితే వీరికి సాయ‌ప‌డేందుకు పెన్సిల్ పార్థ‌సార‌థి(నాని) సాయాన్ని కోర‌తారు. ప్రియ‌ను చూసి ఇష్ట‌ప‌డ్డ నాని వారికి సాయం చేయ‌డానికి అంగీక‌రిస్తాడు. ఇంకేముంది పెన్సిల్ త‌న తెలివి తేట‌ల‌తో దొంగ‌త‌నం చేసిందెవరో క‌నిపెట్టేస్తాడు. ఐతే బ్యాంకు దోపిడికి పాల్పడిందెవరు.. దేశంలోనే నెంబ‌ర్ వ‌న్ రేస‌ర్ దేవ్‌ (కార్తికేయ‌), పెన్సిల్‌ పార్ధసారధికి మ‌ధ్య వివాదమేంటీ.. బ్యాంకు దోపిడికి, దేవ్‌కి సంబందమేంటీ.. ఇవన్నీ తెలియాలంటే మాత్రం సినిమా చూడాలి మరీ…

nanis gangleader
ఎలా ఉందంటే………..

నానీస్ గ్యాంగ్ లీడర్ సినిమాలో న‌టించిన ప్ర‌తి ఒక్క‌రూ మంచి నటులే అని చెప్పవచ్చు. హీరో నాని నుంచి మొదలు.. సీనియర్ నటి లక్ష్మి ఇలా అందరు ఎవ‌రి పాత్ర‌ల్లో వారు బాగా నటించారు. డబ్బింగ్ రచయిత పెన్సిల్ పార్థ‌సార‌థిగా నాని, అత‌ని ఫ్రెండ్ గా ప్రియ‌ద‌ర్శి, బామ్మ‌గా ల‌క్ష్మి, కొడుకును పోగొట్టుకున్న అమ్మ‌గా శ‌ర‌ణ్య‌, కాబోయేవాడిని పోగొట్టుకున్న వ్య‌క్తి ప్రియాంక‌.. ఇలా ప్ర‌తి ఒక్క‌రూ త‌మ తమ పాత్ర‌ల్లో చక్కగా ఒదిగిపోయారు. ఇక ప్రారంభంలో వచ్చే కామెడీ స‌న్నివేశాలు బాగా ఆకట్టుకుంటాయి. రేస‌ర్ పాత్ర‌లో కార్తికేయ చాలా బాగున్నాడు. లొకేష‌న్లు కూడా నేచుర‌ల్‌గా ఉన్నాయి. డైలాగుల పరంగా అక్క‌డ‌క్క‌డా న‌వ్వులు పండించారు. వెన్నెల‌కిశోర్ ఈ సారి ఇంకో వైవిధ్య‌మైన పాత్ర‌లో మెప్పించాడు. సినిమాలో అనూహ్య‌మైన మలుపులు, ట్విస్ట్ లు లేకపోవడం కొంత వెలితేనని చెప్పవచ్చు. మొత్తానితి కాస్త కామెడీ కోరుకునే వారు సినిమా చూడొచ్చు.

nanis gang leader
గమనిక- ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

- Advertisement -

Tags: nanis gangleadr, nanis gangleader review, nanis gangleader movie, nanis gangleader movie review, nanis gangleader film, nanis gangleader rating, nanis gangleader film review

Leave A Reply

Your email address will not be published.