ind-vs-pak

వన్డే ప్రపంచకప్‌ షెడ్యూల్‌..

పాకిస్థాన్ తో భారత్‌ మ్యాచ్‌ ఎప్పుడంటే.. వన్డే ప్రపంచకప్‌ షెడ్యూల్‌..

స్పోర్ట్స్ డెస్క్- బీసీసీఐ (BCCI) క్రికెట్‌ అభిమానులను అలరించేందుకు మరో ఐసీసీ ప్రపంచకప్‌ కు రెడీ అవుతోంది. ఈ సంవత్సరం ఆఖర్లో భారత్‌ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్‌ (ODI World Cup 2023) ముసాయిదా షెడ్యూల్‌ ను బీసీసీఐ ప్రకటించింది.
బీసీసీఐ ముసాయిదా షెడ్యూల్‌ వివరాలు...

అక్టోబర్‌ 5న డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌.. రన్నరప్‌ జట్టు న్యూజిలాండ్‌తో తలపడే మ్యాచ్‌తో వన్డే ప్రపంచకప్‌ టోర్నీ మొదలవుతుంది. అహ్మదాబాద్‌ వేదికగా ఈ మ్యాచ్‌ జరగనుంది. అంతే కాదు నవంబర్‌ 19న అహ్మదాబాద్‌ వేదికగా ఫైనల్‌ మ్యాచ్ జరుగుంది. నవంబర్‌ 15, 16 తేదీల్లో జరిగే సెమీ ఫైనల్స్‌ కోసం వేదికలను ఇంకా వెల్లడించలేదు. మరోవైపు భారత్‌ తన తొలి మ్యాచ్‌ ను అక్టోబర్‌ 8న ఆస్ట్రేలియాతో చెన్నై వేదికగా తలపడనుంది. ఇక భారత్‌, పాకిస్థాన్‌ మధ్య మ్యాచ్‌ అహ్మదాబాద్‌ వేదికగా అక్టోబర్‌ 15న జరగబోతోంది. భారత్‌ లీగ్‌ దశలోని మ్యాచ్‌ లను మొత్తం 9 నగరాల్లో ఆడనుంది. పాకిస్థాన్‌ 5 నగరాల్లో తన లీగ్‌ మ్యాచ్‌లను ఆడనుంది.

భారత్‌ (Indian Cricket Team) ఆడే మ్యాచ్‌ల వివరాలు..

అక్టోబర్‌ 8 - ఆస్ట్రేలియాతో.. వేదిక చెన్నై, అక్టోబర్‌ 11 - అఫ్గానిస్థాన్‌తో.. వేదిక దిల్లీ, అక్టోబర్‌ 15- పాకిస్థాన్‌తో.. వేదిక అహ్మదాబాద్‌, అక్టోబర్‌ 19 - బంగ్లాదేశ్‌తో .. వేదిక పుణె, అక్టోబర్‌ 22 - న్యూజిలాండ్‌తో .. వేదిక ధర్మశాల, అక్టోబర్‌ 29 - ఇంగ్లాండ్‌.. వేదిక లఖ్‌నవూ, నవంబర్‌ 2 - క్వాలిఫయర్‌ జట్టుతో.. వేదిక ముంబయి, నవంబర్‌ 5 : దక్షిణాఫ్రికాతో.. వేదిక కోల్‌కతా, నవంబర్‌ 11 : క్వాలిఫయర్‌ జట్టుతో.. వేదిక బెంగళూరు.

పాకిస్థాన్‌ (Pakistan) మ్యాచ్‌ల షెడ్యూల్ పాకిస్థాన్‌ ఐదు నగరాల్లో లీగ్‌ మ్యాచ్‌లు ఆడనుండగా, అక్టోబర్ 6, 12 తేదీల్లో హైదరాబాద్‌ వేదికగా క్వాలిఫయర్‌కు అర్హత సాధించిన జట్లతో మ్యాచ్‌ లు ఆడుతుంది.


Comment As:

Comment (0)