News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

మేధావులు కాంగ్రెస్ పార్టీలో చేరాలి

తెలంగాణ సమాజాన్ని ఆదుకోవాలంటే మేధావులు కాంగ్రేస్ పార్టీలో చేరాలని పీసిసి చీఫ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లాకు చెందిన రిటైర్డ్ సీఐ దాసరి భూమయ్య తన అనుచరులతో కలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో గాంధీ భవన్ లో కాంగ్రెస్ లో చేరారు. ప్రజా సేవ చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ లో చేరానని ఈ సందర్బంగా ఆయన చెప్పారు. ప్రధాని మోడీ కక్ష పూరిత రాజకీయాల చేస్తూ  మొత్తం రాజకీయ వ్యవస్థను నాశనం చేస్తున్నారని ఉత్తమ్ మండిపడ్డారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పినట్టు విద్యార్థులకు ఉన్న ఉద్యోగాలు పోయే పరిస్థితి నెలకొందని ఆవేధన వ్యక్తం చేశారు. కేంద్రంలో మోడీ, తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాలు ఇంత ఘోరంగా వైఫల్యం చెందుతాయని ఎవరు ఊహించలేదని ఉత్తమ్ అన్నారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కు వార్షిక బడ్జెట్ కు  6 నెలలలో  36 వేల కోట్ల బడ్జెట్ తగ్గిందన్న ఉత్తమ్.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు  బడ్జెట్ లో కేటాయింపు లు తగ్గించారని విమర్శించారు.
uttam

ఎన్నికలు హామీలు అమలు చేయడంలో కేసీఆర్ విఫలమయ్యాడని.. రైతు బంధు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రైతులను కేసీఆర్ మోసం చేస్తున్నాడని మండిపడ్డారు. లక్ష రూపాయల రుణమాఫీ ఏమైందని నిలదీసిన ఉత్తమ్.. యువత ఓట్ల కోసం నిరుద్యోగ భృతి ఇస్తానన్న కేసీఆర్.. ఇప్పుడు ఆ ఉసే ఎత్తడం లేదని ఫైర్ అయ్యారు. మహారాష్ట్రలో మరాఠాలకు 50 శాతం రిజర్వేషన్లు ఇచ్చినట్టు.. తెలంగాణ  రాష్ట్రంలో 50 శాతం పైగా బీసీలున్న నేపధ్యంలో.. 50 శాతం పైగా రిజర్వేషన్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. జరగబోవు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 50 శాతం సీట్లు బీసీ లకు, మైనార్టీ లకు కెటాయిస్తామని హామీ ఇచ్చారు. ఇక ఈనెల  17వ తేది 10 గంటలకు అన్ని జిల్లా కేంద్రాలలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుందని ఉత్తమ్ తెలిపారు. 17 వతేది పీసీసీ ఎక్స్క్యూటివ్  సమావేశంలో ఏఐసీసీ బేటీలో జరిగిన అంశాల పై చర్చిస్తామని అన్నారు. ఎన్నికలతో సంబంధం లేకుండా కార్యకర్తలకు  శిక్షణా తరగతులను నిర్వహిస్తామని ఉత్తమ్ తెలిపారు. అక్టోబర్ 2వ తేదిన గాంధీజీ 150 వ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుతామని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.

- Advertisement -

Tags: pcc chief uttam, nalgonda mp uttam, uttam fire on kcr, uttam fire on pm modi, pcc chief fire on pm modi, pcc chief uttam fire on cm kcr

Leave A Reply

Your email address will not be published.