News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

ఆ సినిమాలో మాజీ సీఎం భార్య

కన్నడంలో మంచి పేరున్న హీరోయిన్ రాధిక. అలా అని ఆమె మన సీనియర్ నటి రాధిక అనుకునేరు. కాదండీ బాబు.. ఈమె రాధిక కుమార స్వామి. ఈ పేరు ఎక్కడో విన్నట్లుందే అనుకుంటున్నారా.. యస్.. కర్నాటక తాజా మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సతీమణి. గతంలో టాప్ హీరోయిన్ గా ఉన్న రాధిక.. కుమార స్వామిని రహస్య వివాహం చేసుకుని.. ఒక బిడ్డకు తల్లయ్యాక మెల్ల మెల్లగా సినిమాలకు దూరమైంది. మరి ఏమైందో ఏమో కానీ.. మళ్లీ సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది రాధిక కుమారస్వామి. పలు బాషల్లో సినిమాలు అంగీకరిస్తూనే.. మంచి చారిత్రాత్మకమైన సినిమాలో నటిస్తోంది.

radhika

తమిళం, తెలుగు, క‌న్న‌డం, మ‌ల‌యాళం, హిందీ త‌దిత‌ర భాష‌ల్లో చారిత్ర‌క నేప‌థ్యం ఉన్న కధాశంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ద‌మ‌యంతి అనే టైటిల్‌ని ఖరారు చేశారు. అరుంధ‌తి, భాగ‌మ‌తి త‌ర‌హా భారీ హార‌ర్ థ్రిల్ల‌ర్ సినిమా ఇది. న‌వ‌ర‌స‌న్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. దీనిని తెలుగులో సంహారిణి పేరుతో విడుదల చేయబోతున్నారు. సంహారిణి టీజ‌ర్ రిలీజ్‌కి స‌న్నాహాలు చేస్తున్నారు. ఐతే ఈ సినిమాలో అందాల భామ అనుష్క న‌టించాల్సి ఉందట. మరి ఏంజరిగిందో తెలియదు కాని.. అనుష్క కు బదులు రాధిక‌కు ఈ అవ‌కాశం ద‌క్కిందట. మరి కర్నాటక మాజీ ముఖ్యమంత్రి భార్య, మాజీ ప్రధాని దేవెగౌడ కోడలు రాధిక నటించిన ఈ సినిమాపై దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో ఆసక్తి నెలకొంది.

- Advertisement -

 radhika

Tags: radhika, raadhika kumaraswamy, radhika kumaraswamy re entry, damayanti, radhika kumaraswamy damayanti, radhika kumaraswamy damayanti movie

Leave A Reply

Your email address will not be published.