News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

ఊరించి ఉస్సూరుమనిపించారు

సినిమా- సాహో

నటీనటులు- ప్రభాస్‌, శ్రద్ధ కపూర్‌, జాకీ ష్రాఫ్‌, నీల్‌ నితిన్‌ ముఖేశ్‌, అరుణ్‌ విజయ్‌, మందిరా బేడీ, వెన్నెల కిషోర్‌, మురళీ శర్మ తదితరులు

సంగీతం- తనిష్క్‌ బగ్చీ, గురు రాంద్వా, బాద్‌షా, జిబ్రాన్‌

కథ, దర్శకత్వం- సుజీత్‌

బాహూబలి సినిమా తరువాత ప్రభాస్ ఒక్కసారిగా అంతర్జాతీయ స్తాయి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ నటించిన సినిమా కావడంతో సాహో పై భారీగా అంచనాలు పెరిగాయి. బాలీవుడ్‌ అందాల భామ శ్రద్ధ కపూర్‌ తో పాటు భారీ తారాగణం, అంతకుమించిన భారీ యాక్షన్‌ సన్నివేశాలు కలిపి సినిమా ఆసక్తికరంగా రూపొందించారు. దీంతో సాహో సినిమా పై ముందు నుంచి అందరిలో ఆసక్తి నెలకొంది. దాదాపు 300 కోట్లతో తెలుగు, తమిళ, హిందీ, మలయాళంలో రూపొందించింన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది. మరి అందరి అంచనాలను సాహో అందుకుందా, ప్రభాస్‌ కెరీర్‌లో ఈ సినిమా మర మైలు రాయిగా నిలుస్తుందా..

saho

సాహో కథ…….

ఇక సాహో లోకి వెళ్తే.. ప్రపంచంలోనే పెద్ద పెద్ద గ్యాంగ్‌స్టర్స్‌ ఉండే వాజీ నగరంలో కథ ప్రారంభమవుతుంది. ప్రముఖ గ్యాంగ్ స్టర్ పృథ్వీ రాజ్‌ (టిను ఆనంద్‌) తన నేర సామ్రాజ్యానికి తన కొడుకు దేవరాజ్‌ (చుంకీ పాండే)ను వారసుణ్ని చేయాలని కలలు కంటుంటాడు. ఇదే సమయంలో పృథ్వీరాజ్‌ చేరదీసిన రాయ్‌ (జాకీ ష్రాఫ్‌).. రాయ్‌ గ్రూప్‌ పేరుతో క్రైమ్‌ సిండికేట్‌ను నడిపిస్తూ పక్కలో బల్లెంలా తయారవుతాడు. దీంతో రాయ్‌ మీద దేవరాజ్‌ ప్రతీకారంతో రగిలిపోతుంటాడు. ఓసారి రాయ్‌ సొంత ఊరైన ముంబయికి వచ్చి అనుమానాస్పదంగా రోడ్డు ప్రమాదంలో మరణిస్తాడు. ఈ సమయంలో ముంబయిలో రెండు లక్షల కోట్ల రూపాయలతో వస్తున్న ఓ భారీ షిప్‌ పేలిపోతుంది. ఈ సందర్బంలోనే రాయ్‌ కొడుకు విశ్వక్‌ (అరుణ్‌ విజయ్‌) గ్యాంగ్‌స్టర్‌ సామ్రాజ్యంలోకి వారసుడిగా ఎంట్రీ ఇస్తాడు. షిప్ తో పాటు పెలిపోయిన రెండు లక్షల కోట్ల రూపాయలను రెండు వారాల్లో తీసుకొస్తానని చాలెంజ్ చేస్తాడు. ఇదే సమయంలో ముంబయిలో రెండు వేల కోట్ల రూపాయల దొంగతనం జరుగుతుంది. ఈ దొంగతనం కేసును తేల్చడానికి అండర్‌ కవర్‌ కాప్‌గా అశోక్‌ చక్రవర్తి (ప్రభాస్‌) రంగంలోకి దిగుతాడు. క్రైమ్‌ బ్రాంచ్‌కు చెందిన అమృతా నాయర్‌ (శ్రద్ధ కపూర్‌)తో కలసి ఈ కేసును విచారిస్తుంటాడు ప్రభాస్. ఇంకేముంది రొటీన్ గానే ఈ క్రమంలో ఇద్దరూ ప్రేమలో పడతారు. ఆ తరువాత కధ ముందుకు సాగుతుంది. ఐతే రాయ్‌ని ఎవరు చంపారు.. విశ్వక్‌ రెండు లక్షల కోట్లు సంపాదించాడా.. అశోక్‌ చక్రవర్తి – అమృతా నాయర్‌ ప్రేమ ఫలిచిందా.. ఇది సినిమాలో చూాడాల్సిందే….

saaho

- Advertisement -

- Advertisement -

సినిమా ఇలా ఉంది…

అండర్ వరల్డ్, గ్యాంగ్‌స్టర్ సినిమాలకు యాక్షన్‌ సీన్లు, ట్విస్టులే ప్రాణం. సాహో సినిమాలో ఇలాంటిని బోలెడన్ని ఉన్నాయి. హాలీవుడ్‌ యాక్షన్ సినిమాలకు ఏ మాత్రం తీసిపోకుండా దర్శకుడు సుజిత్‌ సాహో సినిమాను తెరకెక్కించాడు. తొలి సన్నివేశం నుంచి ఆఖరి వరకు గ్యాంగ్‌స్టర్లు, తుపాకులు, బాంబులు, ఛేజ్‌లతో సినిమా మొత్తం హడావుడిగా కినిపిస్తుంది. సినిమా ప్రారంభంలోనే గ్యాంగస్టర్‌ లీడర్‌ రాయ్‌ చనిపోవడంతో ఈ సినిమా అండర్‌ వరల్డ్‌ వారసత్వం గురించే అని తెలిసిపోతుంది. ఈ క్రమంలో వచ్చే భారీ డైలాగ్‌లతో సినిమా సీరియస్ మూడు లోకి వెళ్తుంది. వాజీ నగరంలో డాన్‌ వారసుడిగా విశ్వక్‌ రావడం, మరోవైపు ముంబయిలో వరుస దొంగతనాల విచారణకు అండర్‌ కాప్‌గా ప్రభాస్ రంగంలోకి దిగడంతో సినిమా మరిం వేగం పెరుగుతుంది. రెండు వేల కోట్ల రూపాయల దొంగతనానికి అసలు కారకుడిని పట్టుకోవడానికి అశోక్‌ చక్రవర్తి వేసే ఎత్తుగడలు, దానికి ప్రత్యర్థి జై (నీల్‌ నితిన్‌ ముఖేశ్‌) ఇచ్చే కౌంటర్లతో సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. సినిమా ఆఖరులో వచ్చే ప్రభాస్‌ పాత్రలో రెండో కోణం ఆసక్తి రేపుతుంది.

సాహో సినిమా అంతా ప్రభాస్‌ వన్‌ మ్యాన్‌ షోగా నడుస్తుందని చెప్పవచ్చు. మిగిలిన పాత్రలకు అంత ప్రాధాన్యం లేదు. సాహో సినిమాకు భారీ యాక్షన్‌ సన్నివేశాలే హైలెట్. హాలీవుడ్‌ స్టంట్ మాస్టర్లు కెన్నీ బేట్స్‌, పెంగ్‌ జాంగ్‌, స్టీఫెన్‌ రిట్చెర్‌, బాబ్‌ బ్రౌన్‌తోపాటు దిలీప్‌ సుబ్బరాయన్‌, స్టంట్‌ శివ, రామ్‌ లక్ష్మణ్‌ యాక్షన్ సన్నివేశాలను బాగా తీశారు. ఎడారిలో మల్ల యోధులతో ప్రభాస్‌ చేసిన ఫైట్‌ సినిమాకు హైలెట్ గా నిలిచింది. ముంబయి నగరంలో శ్రద్ధ కపూర్‌తో కలసి చేసిన గన్‌ ఫైట్లు కొంత మేర ఆకట్టుకుంటాయి. మరో అందాల భామ జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌తో ప్రభాస్‌ ఆడిపాడిన బ్యాడ్‌ బాయ్‌… పాట కుర్రకారుకి కేక పుట్టిస్తుంది. హీరో- హీరోయిన్ల మధ్య ప్రేమ సన్నివేశాలు యూత్ ను ఆకట్టుకుంటాయి. ఐతే యాక్షన్, ఫైట్ సన్నీవేశాల మోతాదు పెరగడంతో అప్పుడప్పుడు ఇంగ్లీష్ డబ్బింగ్ సినిమా చూస్తున్నామా అన్న అనుమానం మాత్రం కలుగుతుంది.

saaho

ఎవరెలా చేశారంటే…

ఇక సాహోలో ప్రభాస్‌ అండర్‌ కవర్‌ పోలీస్ పాత్రలో ఒదిగిపోయాడు. యాక్షన్‌ సన్నివేశాల్లో తనదైన స్టైల్లో నటించి మెప్పించాడు. సినిమా సెంకడ్ హాఫ్ లో షేడ్స్‌ మార్చడంలో ప్రబాస్ పరిణితిని కనబరిచాడు. కొన్ని చోట్ల యాక్షన్‌ సన్నివేశాల్లో హాలీవుడ్‌ హీరోలను తలపించాడని చెప్పవచ్చు. ఇక లేడీ పోలీసు ఆపీసర్ గా శ్రద్ధ కపూర్‌ చక్కగా ఒదిగిపోయింది. ప్రభాస్, శ్రధ్దా కపూర్ ల మధ్య ప్రేమ సన్నివేశాలు బాగా పండాయి. గ్యాంగ్‌స్టర్‌ లీడర్ గా చుంకీ పాండే చక్కగా నటించాడు. కల్కి పాత్రలో మందిరా బేడీ ప్రతిబ కనబరిచింది. జాకీ ష్రాఫ్‌, టిను ఆనంద్‌, అరుణ్‌ విజయ్‌, నీల్‌ నితిన్‌ ముఖేశ్‌, మురళీ శర్మలు తమ తమ పాత్రల మేరకు ఆకచ్చుకున్నారు. మొత్తానికి దర్శకుడు సుజీత్‌ యాక్షన్‌ సన్నివేశాలపై పెట్టిన శ్రద్ధ.. కాస్త కథనం మీద పెడితే సినిమా ఇంకా బాగా వచ్చేదేమో. సాహోలో డైలాగ్స్‌ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. చివరగా సాహోకు ప్రభాస్‌ తో పాటు యాక్షన్‌ సన్నివేశాలు బలాలైతే.. పెద్దగా వినోదం లేకపోవడం, పాటలు అంతగా ఆకట్టుకోకపోవడం, స్క్రీన్‌ ప్లే బాగా లేకపోవడం మైనస్ అని చెప్పవచ్చు.

గమనిక- ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

Tags: saaho, saaho review, saaho movie review, saaho film eview, saaho rating, saaho movie rating, saaho exclusive review, saaho main scenes, saaho songs

Leave A Reply

Your email address will not be published.