News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

నల్లమల వ్యతిరేక కమిటీనీ ఏర్పాటు చేసిన ఉత్తమ్

నల్లమలలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా తెలుగు న్యూస్ సంచలనం న్యూస్ పిల్లర్ చేపట్టిన ఉద్యమానికి అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. న్యూస్ పిల్లర్ నల్లమల్లలో యురేనియం తవ్వకాలపై లేవనెత్తిన అభ్యంతరాలతో అంతా ఏకీభవిస్తున్నారు. కేవలం తెలంగాణ వాళ్లే కాకుండా ప్రాంతాలకు అతీతంగా విద్యావేత్తలు, కళాకారులు, రాజకీయ నాయకులు గళమెత్తుతున్నారు. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో కలిసి రావాలని అందరు మూకుమ్మడిగా పిలుపునిస్తున్నారు. నల్లమలను కాపాడుకొందామంటూ న్యూస్ పిల్లర్ ప్రారంభించిన ఉద్యమం అంతకంతకు ఉదృతమవుతోంది. ఈమేరకు పీసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్లమలలో యురేనియం తవ్వకాలపై పోరాడేందుకు ప్రత్యేకంగా కమీటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి మాజీ పీసిసి చీఫ్ వీ హనుమంత్ రావును చైర్మెన్ గా నియమించారు.
save nallamala

తాజాగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ నల్లమలలో యురేనియం తవ్వకాలపై నిరసన గళం విన్పించారు. ఈమేరకు టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డికి ఫోన్ చేసిన పవన్.. యురేనియంపై కలిసి పోరాడదామని పిలుపునిచ్చారు. సోమవారం జరిగే అఖిలపక్ష సమావేశానికి రావాలని రేవంత్ రెడ్డిని పవన్ కళ్యాణ్ ఆహ్వానించారు. దీనికి రేవంత్‌ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఇక ఈ అఖిలపక్ష సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు, నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, టీడీపీ తెలంగామ అధ్యక్షుడు ఎల్‌ రమణ, సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు చాడ వెంకట్‌ రెడ్డి, తమ్మినేని వీరభద్రం, టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం తదితరులను పాల్గొననున్నారు. మరోవైపు నల్లమలలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా సినీతారలు, ప్రముఖులు గళం విప్పుతున్నారు.

save nallamala

- Advertisement -

ఇక సేవ్‌ నల్లమల పేరుతో న్యూస్ పిల్లర్ చేపట్టిన ఉద్యమానికి ఏపీ మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మద్దతిచ్చారు. తెలంగాణలో యురేనియం శుద్ధి ప్రాజెక్టు అక్కరలేదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రాజెక్టు కోసం ప్రజల జీవితాలను ఫణంగా పెట్టవద్దని లోకేశ్ అన్నారు. అభివృద్ధి ముఖ్యమే.. కానీ అది పర్యావరణాన్ని, ప్రజల జీవితాలను ఫణంగా పెట్టేదిగా ఉండకూడదని చెప్పారు. ఇలాంటి ప్రాజెక్టులు స్వీయ ప్రయోజనాలకే తప్ప జాతి ప్రయోజనాలకు కాదని లోకేష్ ట్విట్టర్ వేధికగా స్పందించారు.

Tags: save nallamala, news pillar save nallamala, save nallamala agitation, congress committe on save nallamala, congress committe on nallamala, uttam formed committe on nallamala, pawan about nallamala, uttam about nallamala, lokesh about nallamala, anasuya about nallamala

Leave A Reply

Your email address will not be published.