News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

“సేవ్ న‌ల్ల‌మ‌ల” కు న్యూస్ పిల్ల‌ర్ మ‌ద్ద‌తు..

కృతికే ర‌క్ష‌ణ క‌వ‌చంగా ఉన్న న‌ల్ల‌మ‌ల అడ‌వులలో ఇప్పుడు యురేనియం చిచ్చు రాజుకుంది. ప‌చ్చ‌టి దుప్ప‌టి క‌ప్పిన‌ట్లు ఉండే.. ద‌ట్ట‌మైన న‌ల్ల‌మ‌ల ఇప్ప‌డు యురేనియం పేరు వింటేనే వ‌ణికిపోతుంది. అవును.. ద‌శాబ్దాలుగా  ఆ అడ‌విని న‌మ్ముకున్న‌న‌ల్ల‌మ‌ల అడ‌వి బిడ్డ‌ల్లో ఎన్న‌డూ లేని ఆంధోళ‌న వ్య‌క్తం అవుతుంది. తెలంగాణ‌,ఏపీ ల‌మ‌ధ్య వంద‌ల ఎకరాల్లో విస్త‌రించిన‌ ద‌ట్ట‌మైన‌ న‌ల్ల‌మ‌ల‌లో యురేనియం త‌వ్వ‌కాలు చేప‌ట్టాల‌ని కేంద్ర , రాష్ట్ర ప్ర‌భుత్వాలు నిర్ణ‌యం తీసుకోవ‌డంతో… ఇప్ప‌డికే కాంగ్రెస్ పార్టీ , ప్ర‌జా సంఘాలు, ప‌ర్యావ‌ర‌ణ‌ ప్రేమికులు, మేధావులు ఆంధోళ‌న బాట ప‌ట్టారు. ఇప్ప‌డికే.. వీరంతా  అడ‌వి బిడ్డ‌లకు అండ‌గా.. న‌ల్ల‌మ‌లను కాపాడుకుందాం అంటూ.. నిర‌స‌న‌ల‌ను కొన‌సాగిస్తున్నారు.అయితే ఇటు కేసీఆర్, అటు మోడి ప్ర‌భుత్వం ఈ నిర‌స‌న‌లు లెక్క‌చేయ‌డంలేదు.

congress_support_save_nallamala

ఇక యురేనియం త‌వ్వ‌కాల‌కు వ్య‌తిరేకంగా  ఆంధోళ‌న చేస్తున్న వారిని అరెస్టులు చేస్తు.. ప్ర‌భుత్వం నిర‌స‌న‌కారుల‌పై నిర్భంధం కొన‌సాగిస్తుండ‌టంతో.. ఇప్పుడు సోష‌ల్ మీడియాలో.. సేవ్ న‌ల్ల‌మ‌ల పేరుతో పెద్ద ఎత్తున క్యాంపెయిన్ కొన‌సాగుతుంది. తాజా ఈ క్యాంపెయిన్ క మ‌ద్ద‌తు ప‌లికారు ప్రముఖ డైరెక్టర్ శేఖర్‌ కమ్ముల. ఆయ‌న త‌న ట్విట్ట‌ర్లో.. ‘నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలు చేపట్టబోతున్నారు. దీని వల్ల మన పర్యావరణానికి తీవ్ర నష్టం. చెంచులు, ఇతర అటవీ వాసులు నివసిస్తున్న ప్రాంతం, అంతరించిపోతున్న పులులు నివసించే ప్రాంతం అయిన నల్లమల సమూలంగా నాశనం అవుతుంది అని ట్విట్ చేశారు.

director_shekar_kammula_support_to_save_nallamala

- Advertisement -

అంతేకాదు.. యురేనియం త‌వ్వ‌కాల‌తో కృష్ణ, దాని ఉపనదులు కలుషితం అవుతాయి. ఇప్పటికే చాలా మంది క్యాన్సర్‌ బారిన పడ్డారు. యురేనియం తవ్వకాల వల్ల క్యాన్సర్‌ రోగుల సంఖ్య మరింత పెరుగుతుంది. యురేనియం కోసం పర్యావరణాన్ని నాశనం చేయకండి. వెంటనే ప్రభుత్వం స్పందించి చెంచులని, ఇతర ఆదివాసులని, పర్యవారణాన్ని మొత్తంగా నల్లమల అడవుల్ని కాపాడాలి’ అని ట్వీట్ చేశారు. మొత్తానికి డిఫ‌రెంట్ సినిమాలు తీయ‌డ‌లోనే కాదు.. సామాజిక అంశాల‌పై ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తూ.. శేఖ‌ర్ క‌మ్ముల సేవ్ న‌ల్ల‌మ‌ల‌కు మ‌ద్ద‌తు ప‌ల‌క‌డం ప‌ట్ల ఆయ‌నపై ప్ర‌శంశ‌లు కురుస్తున్నాయి.

save_nallamala_on_uranium_mining.

ఇక ‘సేవ్ న‌ల్ల‌మల’ క్యాంప‌యిన్ లో ‘న్యూస్ పిల్ల‌ర్’ సైతం పాలు పంచుకుంటుంది. ఇప్ప‌డికైనా ప్ర‌భుత్వాలు క‌ళ్ళు తెర‌వాల‌ని “న్యూస్ పిల్ల‌ర్” కోరుకుంటుంది. ఇప్ప‌డికే కాంక్రీట్ జంగ‌ల్ గా మారి.. క‌నుమ‌రుగైతున్న ప్ర‌కృతిని.. కాపాడుకోవాల్సిన భాద్య‌త ప్ర‌భుత్వాల‌పై ఉంది. ఒక‌వైపు అడ‌విని కాపాడుకుందాం అంటూనే.. మ‌రోవైపు ద్వంస‌ర‌చ‌న‌కు సిద్ద‌మైతున్న ప్ర‌భుత్వాల ఆలోన‌ల‌కు స్వ‌స్థి ప‌ల‌కాల‌ని కోరుతున్న ‘న్యూస్ పిల్ల‌ర్’..  సేవ్ న‌ల్ల‌మ‌ల‌కు సంపూర్ణ మ‌ద్ద‌తు ప‌లుకుతుంది. ప్ర‌భుత్వాలు, పాల‌కులు  ఇప్ప‌డికైనా త‌మ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల‌ను ప‌క్క‌న బెట్టి.. ప్ర‌కృతికే గొడ్డ‌లి పెట్టుగా మార‌నున్న యురేనియం త‌వ్వ‌కాల‌ను స్వ‌స్తి ప‌ల‌కాల‌ని “న్యూస్ పిల్ల‌ర్” డిమాండ్ చేస్తుంది.

tiger_zone_nallamala_forest

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.