News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

తెలంగాణ కు స్ట్రాంగ్ గవర్నర్

తెలంగాణ సీఎం కేసీఆర్ కు ప్రధాని మోడీ షాక్ ఇవ్వబోతున్నరా అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. త్వరలోనే కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడైన గవర్నర్ నరసింహన్ ను మర్చుతున్న ట్లూ తెలుస్తోంది. జమ్ము కాశ్మీర్ ను రెండు రాష్ట్రాలుగా విభజించిన కేంద్రం త్వరలోనే ఆ రెండు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ లను నియమించ బోతోంది. అందులో ఏదో ఒక రాష్ట్రానికి కొత్త గవర్నర్ గా గతంలో తెలుగు రాష్ట్రాలకు, ప్రస్తుతం తెలంగాణకు గవర్నర్ గా పనిచేస్తున్న ఈఎస్ఎల్ నరసింహన్ ను నియమించ వచ్చని తెలుస్తోంది.

Telangana governor Narsimhan

- Advertisement -

ఇందుకు సంబంధించి కేంద్ర హోమ్ శాఖ ఆమోదం తెలిపినట్టు సమాచారం. దాదాపు 10 సంవత్సరాల కాలం నుంచి గవర్నర్ గా పని చేస్తున్న ఆయన, గతంలో కేంద్ర సర్వీసుల్లోనూ విధులు నిర్వహించారు. హోమ్ శాఖలోనూ పనిచేశారు. శాంతిభద్రతల అంశంపై ఆయనకు ఉన్న పట్టు కారణంగానే కశ్మీర్ గవర్నర్ గా ఆయన పేరును ఖరారు చేసేందుకు కేంద్రం మొగ్గు చూపేట్టుగా చేసిందని తెలుస్తోంది. ఆయన నియామకంపై అధికారిక ఉత్తర్వులు ఇంకా వెలువడలేదు.

త్వరలోనే బిజెపి ఆపరేషన్ తెలంగాణ మొదలు పెట్టబోతున్నారు అంటూ ప్రచారం అవుతోంది. అందుకు అనుగుణంగా కొత్త గవర్నర్ ను నియమించబోతున్నారు అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సుష్మా స్వరాజ్ తెలంగాణ కు గవర్నర్ గా రాబోతున్నరంటు చర్చ జరుగుతున్న.. కేసీఆర్ ను ఎదుర్కొనే స్ట్రాంగ్ నేత రాబోతున్నట్టూ తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లోనే తెలంగాణా కు కొత్త గవర్నర్ రాబోతున్నారు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. టిఆర్ఎస్ లో కూడా ఇదే చర్చ జరుగుతోంది.

Leave A Reply

Your email address will not be published.