News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

పాలనపై చేతులెత్తేసిన కేసీఆర్ ..!

తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్‌ పై వాడీవేడీ చర్చలో సీఎం కేసీఆర్ .. ప్రతిపక్ష నేత భట్టి విక్రమార్కలు హాట్ హాట్ గా తలపడ్డారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు మిగులు బడ్జెట్ ఉండగా .. ఇప్పుడు ఆరేళ్లకే రాష్ట్రాన్ని దివాలా తీసిన ప్రభుత్వంగా బడ్జెట్‌ ను ప్రవేశ పెట్టి రాష్ట్రాన్ని హాస్యాస్పదంగా మార్చారని భట్టి విక్రమార్క విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం గత ఆరేళ్లలో మూడు లక్షల కోట్ల అప్పు చేసిందని ఆయన నిలదీశారు. ఈ అప్పులు ప్రభుత్వానికి భారం కాదా అని భట్టి ప్రశ్నించారు. ఓట్‌ ఆన్‌ బడ్జెట్‌ కు ప్రస్తుత బడ్జెట్‌కు కోత పెట్టారని .. ప్రాధన్యాతాంశాల్లోనూ వివక్ష చూపారని ఆరోపించారు.

Bhatti

బడ్జెట్ కేటాయింపుల్లో ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు ఉందని .. దుమ్ముగూడెం-రాజీవ్‌సాగర్‌ .. దుమ్ముగూడెం-ఇందిరాసాగర్‌ లేదని సభకు వివరించారు. బడ్జెట్ లో ప్రభుత్వం చెబుతున్న అన్ని అంశాలు వాస్తవికతకి దూరంగా ఉన్నాయని తెలిపారు. కాళేశ్వరంపై ప్రాజెక్ట్ పై ప్రభుత్వం ఆర్భాటాలే తప్ప జరిగింది శూన్యమని విక్రమార్క దుయ్యబట్టారు. ఒక దశలో భట్టి .. కేసీఆర్ ఆ మధ్య జరిగిన వాడీ వాదనలో ఒకింత కేసీఆర్ వెనక్కి తగ్గడం ఆసక్తికర అంశం.

- Advertisement -

Bhatti

Tags: TELANGANA ASSEMBLY,CM KCR, BHATTI VIKRAMARKA,TRSLP,CLP, CONGRESS MLAS,TRS MLAS, TELANGANA BUDGET SESSION, BHATTI VIKRAMARKA SPEACH, BHATTI V/S KCR,CLP MEETING

Leave A Reply

Your email address will not be published.