News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

ఈటలను కేబినెట్ నుంచి తప్పించేందుకు కారణం ఇదే..!

హైదరాబాద్ : మంత్రివర్గం నుంచి ఈటెల రాజేందర్ ను తప్పించబోతున్నరా..? అంటే టిఆర్ఎస్ వర్గాలు అవుననే అంటున్నాయి. త్వరలోనే కేబినెట్ విస్తరణ ఉండొచ్చని చర్చలు జరుగుతున్న వేళ.. ఈటెల టార్గెట్ గా పార్టీ ముఖ్యనేతలు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. బిసి_ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఈటెల ను తప్పించేందుకు ఒక బలమైన కారణం చూపేందుకు తన గులాభి ముఖ్య నేతలు స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది.

ఈటెల రాజేందర్ ముందు నుంచి అసంతృప్తితో నే వున్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. మొదటి ప్రభుత్వంలో మంత్రి పదవి ఇచ్చినా.. ఆయనకు తెలియకుండానే ప్రగతి భవన్ లో ఆయన శాఖ అధికారులతో సీఎం కేసీఆర్ రివ్యూ లు చేయటం పై ఆయన గుస్సా అయ్యారు. జస్ట్ ఆయన అసంతృప్తి తో వున్నారని తెలిసిన పార్టీ అధినాయకత్వం ఆయనకు ప్రగతిభవన్ మెట్లు కూడా ఎక్కనీయ లేదని తెలుస్తోంది. దాదాపు మూడు నెలలు ఆయన పార్టీ ముఖ్యనేతలకు దూరంగా ఉన్నారు. తర్వాత మాట కలిసినా మనసులు మాత్రం కలవలేదని ఆయనకు దగ్గరగా వుండే వాళ్ళు అనుకుంటున్నారు.

రెండో సారి ప్రభుత్వంలో మంత్రి వర్గంలో ఈటలకు చోటు దక్కుతుందా చివరి వరకు టెన్షన్ పెట్టారు. ప్రమాణ స్వీకారానికి కొద్ది గంటల ముందు వరకు సమాచారం లేక ఆయన వర్గం ఆందోళనకు గురైంది. ఈయన పని తీరుపై సీఎం అసంతృప్తి, ప్రతి దాంట్లో వారు వేలు పెట్టడంపై ఈటెల అసంతృప్తిగా వున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పుడు త్వరలోనే మంత్రి వర్గ విస్తరణ వుండే అవకాశం వుందని కొన్ని రోజుల నుంచి రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఎలా తప్పిస్తరు.. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఈటల ను తప్పిస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని టిఆర్ఎస్ లోనే చర్చ జరిగింది. అయితే శనివారం రెండు వార్త పత్రికల్లో( మన తెలంగాణ, ఆంధ్రప్రభ) ఈటల ను టార్గెట్ చేస్తూ వార్తలు ప్రచురితం అయ్యాయి. ఆరోగ్య మంత్రి అనారోగ్య ఆలోచన అనే టైటిల్ తో .. టిఆర్ఎస్ రెండో అధికార పత్రిక మన తెలంగాణ పేపర్లో రావటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. (రెవెన్యూ డిపార్ట్మెంట్ కు సంబంధించి కలెక్టర్ల సమావేశం లో జరిగిన చర్చ ను ఆ శాఖకి చెందిన కొద్దిమంది యూనియన్ నేతలకు చెప్పారని .. వారిని రెచ్చగొట్టారు అని ఆ వార్త సారాంశం.)

Minister etala runout from kcr cabinet

- Advertisement -

ఇదంతా ఏదో సమాచారం అన్వేషించి ఆ పేపర్ల రిపోర్టర్లు వార్తను సేకరించారు అనటానికి ఎలాంటి అవకాశం లేదు. ఈ వార్త అచ్చు వేయటం వెనక .. ఆ పార్టీ కే చెందిన అధి నేత హస్తం ఉండొచ్చని చర్చ జరుగుతోంది. కేసీఆర్ కనుసన్నలలో నడిచే “మన తెలంగాణ” పేపర్లో ఈ వార్త వచ్చిందంటే .. ఈటల ను మంత్రి వర్గం నుంచి తప్పించేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నట్లే నని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈటల ను ఎలా తప్పిస్తారు అనే ప్రశ్నకు తప్పించే కన్నా ముందే సమాధానం ఇస్తున్నారని కొందరు అనుకుంటున్నారు.

టిఆర్ఎస్ లో ఎవరికైనా మూడిందంటే .. వారిని టార్గెట్ చేసి మానసికంగా దెబ్బ తీయటం గులాభి పార్టీ లో ఆనాటి నుంచి వున్న వ్యూహమే నని ఆపార్టీ లోని సీనియర్ లు చెబుతున్నారు. గతంలో ఆలే నరేంద్ర, మొన్న జీ. వివేక్, ఇప్పుడు ఈటల రాజేందర్.. ఇలా ఎవరైనా కావొచ్చు. ఎవరికైనా మూడిండంటే .. ఇలాగే ఉంటుందని టిఆర్ఎస్ పాత నేతలు అనుకుంటున్నారు. ఇప్పుడు ఈటల ను ఎలా తప్పిస్తారు అనే ప్రశ్నకు తప్పించే కన్నా ముందే సమాధానం ఇస్తున్నారని కొందరు అనుకుంటున్నారు.

కేటీఆర్ కు  మళ్లీ మంత్రి వర్గం లో అవకాశం ఇచ్చేందుకే ఈటల ను తప్పిస్తున్నరని చర్చ జరుగుతోంది. అదే జరిగితే కరీంనగర్ జిల్లాలో ముగ్గురు మంత్రులు అవుతారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక ఇప్పటివరకు ప్రతి జిల్లా నుంచి ఇద్దరికీ అవకాశం దక్కింది ఇప్పుడు ఈటల ను తప్పిస్తే గాని కరీం నగర్ కోటలో కేటీఆర్ కు మళ్లీ మంత్రిగా అవకాశం ఇవ్వొచ్చు. ఈటల ను మంత్రి వర్గం నుంచి తప్పించేందుకు కారణం కావొచ్చని చర్చ జరుగుతోంది. ఒకవేళ మంత్రి వర్గం నుండి తప్పిస్తే ఈటల ఏమి చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.

Tags: Etala Rajender, minister etala Rajender address, cm kcr new cabinet, Telangana council of ministers, Telangana CMO contact numbers, cm kcr, cm kcr family, telangana pragathibavan.

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.