News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి పై సిబిఐ విచారణ జరపాలి..

ప్రభుత్వం మొండిగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు తో 80 వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని ఆరోపించారు పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. అందులో సగం ఖర్చు తోనే తుమ్మిడి హెట్టి దగ్గర ప్రాజెక్టు పెడితే 160 టీఎంసీ ల నీళ్లు సాగు నీరు అందుబాటులో కి వచ్చేవనీ అన్నారు. ఇంత చేసినా ఇప్పటివరకు ఒక్క ఎకరానికి అయినా నీళ్ళిచ్ఛారా అని ప్రశ్నించారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు శంకుస్థాపన చేసిన అదిలాబాద్ జిల్లా తుమ్మిడిహెట్టి లో కాంగ్రెస్ ముఖ్య నేతల బృందం పర్యటించింది. సికింద్రాబద్ రైల్వేస్టేషన్ నుంచి తెలంగాణ ఎక్స్ ప్రెస్ లో సిర్పూర్ కాగజ్ నగర్ కు వెళ్ళిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ ,ఎంపీ లు రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎంపీ లు, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు, ఏఐసీసీ కార్యదర్శులు, ముఖ్య నాయకులు ప్రాణహిత నదిలో నీటి లభ్యత .. ప్రాజెక్ట్ పనులు నిర్మాణ పనులను పరిశీలించారు.

Tpcc leaders visit pranahitha chevella ptaject

ప్రజా ధనం దుర్వినియోగం చేయకుండా చూడాల్సిన బాధ్యత ప్రతిపక్షం గా తమపై వుంది కాబట్టే తాము పరిశీలనకు వెళ్లినట్లు తెలిపారు. గతంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కు జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ చేసిన కేసీఆర్.. 2014 లో అధికారంలోకి రాగానే పక్కన పెట్టడం వెనక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. ఇక్కడ సముద్ర మట్టానికి 152 మీటర్ల ఎత్తులో కడితే 16.4 లక్షల ఎకరాలకు నీరు అందించే విధంగా దాదాపు 38,000 కోట్ల తో ఇక్కడ ప్రాజెక్టు కట్టాలని పనులు ప్రారంభిస్తే … రీ డిజైన్ పేరుతో దాన్ని లక్ష కోట్లకు పెంచారనీ మండిపడ్డారు. కనీసం గ్లోబల్ టెండర్లు కూడా పిలవలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. తుమ్మిడి హెట్టి వద్ద ప్రాజెక్ట్ ను నిర్మిస్తే ..తక్కువ ఖర్చు తో ఇక్కడ నుండి ఎల్లంపల్లి కి నీళ్లు తీసుకు వెళ్ళవచ్చనీ అన్నారు. ఇక్కడ పెట్టుబడి ఒక్క సారి పెడితే ఎల్లకాలం నీళ్లు వచ్చేవి కాళేశ్వరం దగ్గర ఎప్పటికి ప్రతి ఏటా కరెంట్ కు ఖర్చు పెట్టాలి. చాలా మంది ఇంజనీర్లు కూడా ఇదే విషయం చెబితే కేసీఆర్ పట్టించుకోవటం లేదని అన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.

బట్టి విక్రమార్క

Telangana congress leaders visit pranahitha chevella praject

కాళేశ్వరం ప్రాజెక్ట్ కు అయిన ఖర్చుపై సీబీఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క. 25 శాతం ప్రాజెక్టు పూర్తి కాకముందే 80,000 వేల ఖర్చు పెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు… మిగతా 75 శాతం పనులకు ఇంకా ఎన్ని కోట్లు ఖర్చు పెడతారనీ ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఓపెనింగ్ రోజు ఒక్క ఎకరానికి అయిన నీళ్లు ఇచ్ఛవా అని సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు.

జీవన్ రెడ్డి.ఎమ్మెల్సీ

Telangana congress leaders visit pranahitha chevella praject

- Advertisement -

మహారాష్ట్ర తో 148 మీటర్ల తో ఒప్పందం కుదుర్చుకుని ఎందుకు కట్టడం లేదనీ ప్రశ్నించారు. తుమ్మిడి హెట్టి వద్ద శాశ్వతంగా 148 మీటర్ల ఎత్తులో ప్రాజెక్టు నిర్మించాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్ర జల వనరుల సంఘం కు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎందుకు dpr ఇవ్వలేదనీ ప్రశ్నించారు.

- Advertisement -

రేవంత్ రెడ్డి ఎంపీ

Telangana congress leaders visit pranahitha chevella praject

ప్రాజెక్టు లలో జరుగుతున్న అవినీతి పై సీబీఐ విచారణ చేపట్టాలి అవినీతి పై కేంద్రం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ఎంపీ రేవంత్ రెడ్డి. 12 లక్షల ఎకరాలకు నీళ్లు అందిస్తున్నానని 2 లక్షల కోట్ల ఖర్చు కేసీఆర్ ఖర్చు పెట్టడంపై అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. తెలంగాణ లో ఉన్న ప్రాజెక్టులు అన్ని కాంగ్రెస్ పార్టీ నిర్మించింది అన్న రేవంత్ రెడ్డి.. 50 లక్షల ఎకరాలకు నీళ్లు అందించింది కాంగ్రెస్ ప్రభుత్వమే నని అన్నారు. తెలంగాణ లోనే అన్నం పెట్టని కేసీఆర్ రాయలసీమ కు నీళ్లు అందిస్తాడా అని ప్రశ్నించారు.

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎంపీ

రి డిజైన్ ల పేరు తో వేల కోట్లు కేసీఆర్ దోచుకుంటున్నాడనీ ఆరోపించారు వెంకట్ రెడ్డి. వేల కోట్ల అవినీతి జరిగిందని అని చెప్పిన నడ్డా… కేసీఆర్ మీద ఎందుకు విచారణ చేపట్టడం లేదనీ ప్రశ్నించారు.ఉమ్మడి రాష్ట్రంలో మమ్ములను సీఎం లను చూస్తే లాగులు తడుస్తున్నాయ్ అని అన్నారు కదా.. ఇప్పుడు కేసీఆర్ ను చూస్తే మంత్రులు, ఎమ్మెల్యే లకు లాగులు తాడుస్తున్నాయా అని ప్రశ్నించారు.

శ్రీధర్ బాబు.ఎమ్మెల్యే

కాళేశ్వరంప్రా జెక్ట్ కట్టి ఆదిలాబాద్ కు ఆయకట్టు లేకుండా చేశారని ఆరోపించారు mla శ్రీధర్ బాబు. మెడిగడ్డ,అన్నారం,సుoదిళ్ళ కట్టి ఒక్క ఎకరం కు కూడా నీళ్లు అందించ లేదనీ అన్నారు.

Leave A Reply

Your email address will not be published.