News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

కెసిఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు ..: కెసిఆర్ సర్కార్ పై ఉత్తమ్ ఫైర్

  • దొడ్డిదారిన మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటారా ..
  • కెసిఆర్ సర్కార్ పై ఉత్తమ్ ఫైర్ ..

నల్గొండ : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం బతకాలో, చావాలో ప్రభుత్వమే చెప్పాలన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మునిసిపాలిటీ ప్రాంగణంలోకి రాజ్యసభ సభ్యుడు కేవీపీ రాంచందర్‌రావుకు అనుమతి లేదని పోలీసులు ఆపివేయడంతో ఆయన కొద్దిసేపు బయటనే ఉండిపోయారు. అదే ప్రాంగణంలో ఉత్తమ్‌ విలేకరులతో మాట్లాడుతూ.. కొంతమంది అదృష్టం కొద్దీ మంత్రులై పోజులు కొడుతున్నారని మండిపడ్డారు.

- Advertisement -

మునిసిపల్‌ కమిషనర్‌ ఓ ఫేక్‌ గెజిట్‌ తీసుకొని కేవీపీ ఓటు రద్దు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కేవీపీ రాంచందర్‌రావును తెలంగాణ రాజ్యసభ సభ్యుడు కాదని గుర్తించే స్థాయి కమిషనర్‌కు ఉందా? అని ప్రశ్నించారు. మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే సైదిరెడ్డి కుట్ర పన్ని కేవీపీ ఓటు తొలగింపజేశారని ఆరోపించారు. నోటీసులు ఇవ్వలేదంటూ ఎన్నిక వాయిదా వేయడం పద్ధతి కాదని అన్నారు. జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌, కేసీఆర్‌, కేటీఆర్‌లు ప్రజాస్వామ్యాన్ని అభాసుపాలు చేస్తున్నారని విమర్శించారు. కాగా తెలంగాణ ప్రజలకు తన సేవలు కొనసాగిస్తానని ఎంపీ కేవీపీ రాంచందర్‌రావు అన్నారు.

Leave A Reply

Your email address will not be published.