News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

వ‌ద‌ల బొమ్మాలి.. అన్న ఉత్త‌మ్ .. సూర్యాపేట్ క‌లెక్ట‌ర్ అవుట్..

  • ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడు ఉత్త‌మ్..
  • కేసీఆర్ స‌ర్కార్ కు ఉత్త‌మ్ జ‌ల‌క్..
  • ఉత్త‌మ్ దెబ్బ‌కు ఇద్ద‌రు క‌లెక్ట‌ర్ లు అవుట్..

ప‌ట్టువ‌ద‌ల‌ను విక్ర‌మార్కుడ‌ని అనిపించుకున్నాడు పీసీసీ చీప్ , న‌ల్గొండ ఎంపీ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి. మున్ఫిఫ‌ల్ పాల‌క మండ‌లి ఎన్నిక‌ల్లో టిఆర్ఎస్ కుయుక్తుల‌ను సింగిల్ హ్యాండ్ తో ఢీ కొట్టాడు. అంతేకాదు త‌న ఆంధోళ‌న‌తో ఏకంగా సూర్యాపేట్ క‌లెక్ట‌ర్ కే జ‌ల‌క్ ఇచ్చారు. అవును.. మున్పిఫ‌ల్ ఎన్నిక‌ల్లో నేరేడు చ‌ర్ల మున్పిపాలిటీలో చైర్మ‌న్ , వైస్ చైర్మ‌న్ లను ద‌క్కించుకోవాల‌ని ప్ర‌య‌ల్నం చేసింది టిఆర్ఎస్. నేరేడు చ‌ర్ల మున్పిపాలిటీకి జ‌రిగిన ఎన్నిక‌ల్లో కాంగ్రేస్ మెజారిటి వార్డుల‌ను గెలుచుకుంది. దీంతో చైర్మ‌న్ పీటం ద‌క్కించుకునేందుకు టిఆర్ఎస్ ఎక్స్ అఫిసియో స‌భ్యుల ఓటును వాడుకునేందుకు ప్ర‌య‌త్నించింది.

- Advertisement -

టిఆర్ఎస్ ఎక్స్ అఫిసియో స‌భ్యులుగా.. స్థానిక ఎమ్మెల్యే సైదిరెడ్డి , ఎంపి బ‌డుగుల లింగ‌య్య యాద‌వ్ తోపాటు.. ఎమ్మెల్సీ బొడికుంట వెంక‌టేశ్వ‌ర్లు ల ఓటు వాడుకోవాల‌ని చూసింది. అయితే కాంగ్రెస్ కూడా.. స్తానిక ఎంపిగా ఉన్న ఉత్త‌మ్ తోపాటు.. రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో.. తెలంగాణ‌కు కేటాయించిన కేవీపి రామ‌చంద్రారావు ఓటును వినియోగించుకోవాల‌ని డిసైడ్ అయ్యింది. అయితే కేవీపి ఓటు వేసేందుకు వీళ్ళేద‌ని టిఆర్ఎస్ నేత‌లు ప‌ట్టుప‌ట్టారు. అంతేకాకుండా.. క‌లెక్ట‌ర్ , అదికారుల‌పై వ‌త్తిడి తీసుకురావ‌డంతో.. కేవీపీకి అనుమ‌తి ఇవ్వ‌మ‌ని నేరేడు చ‌ర్ల మున్పిఫ‌ల్ క‌మీష‌నర్ ప్ర‌క‌టించారు. దీంతో ఆగ్ర‌హంతో ఊగిపోయిన ఉత్త‌మ్.. ఆదివారం అర్ధ‌రాత్రి సూర్యాపేట్ క‌లెక్ట‌రేట్ ముందు ధ‌ర్నాకు దిగారు.

సూర్యాపేట్ క‌లెక్ట‌ర్ అమోయ్ కుమార్ తీరుకు నిర‌స‌న‌గా ఏకంగా 18 గంట‌ల పాటు త‌న ఆంధోళ‌న కొన‌సాగించారు ఉత్త‌మ్. కేవీపీ తో క‌లిసి..క‌లెక్ట‌రేట్ ముందు ధ‌ర్నా కొనసాగిస్తూనే… మ‌రోవైపు క‌లెక్ట‌ర్ , మున్పిఫ‌ల్ క‌మీష‌న‌ర్ ల తీరుపై ఎన్నిక‌ల సంఘానికి సీనియ‌ర్ నేత మ‌ర్రి శ‌శిధ‌ర్ రెడ్డితో పిర్యాదు చేయించారు. ఇలా ఎక్క‌డ ప‌ట్టు వ‌ద‌ల‌కుండా.. రాష్ట్ర ఎన్నిక‌ల సంఘంపై వ‌త్తిడి తీసుకురావ‌డంతో.. చేసేదిలేక ఎల‌క్ష‌న్ క‌మీషన్ దిగివ‌చ్చింది. ఏకంగా సూర్యాపేట్ క‌లెక్ట‌ర్ ను త‌ప్పించాల్సిందే అంటు.. ప్ర‌బుత్వాన్ని ఆదేశించింది. అంతే కాకుండా.. ఏపీ కి కేటాయించ‌బ‌డిని ఎంపిగా ఉన్న కేకే .. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మున్పిపాలిటీలో ఎక్స్ అఫిసియో స‌భ్యుడిగా ఓటు వేయ‌డాన్ని త‌ప్పు ప‌డుతూ.. ఈసీకి కాంగ్రెస్ పిర్యాదు చేసింది. దీనితో జ‌రిగిన‌ త‌ప్పిదాన్ని గుర్తించిన ఈసీ.. రంగారెడ్డి క‌లెక్ట‌ర్ పై కూడా వేటు వేయాల‌ని ఆదేశించింది. దీనితో ప్ర‌భుత్వం చేసేదిలేక సూర్యాపేట, రంగారెడ్డి క‌లెక్ట‌ర్ ల‌పై వేటు వేసింది. మొత్తానికి పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ త‌న పోరాటంతో అటు స‌ర్కార్ కు , ఇటు.. ఎల‌క్ష‌న్ క‌మీషన్ కు చుక్క‌లు చూపించారు.

Leave A Reply

Your email address will not be published.