News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

కన్ను మూసిని విజయ నిర్మల

ప్రముఖ సీనియర్ నటి, దర్శక నిర్మాత, నటుడు సూపర్ స్టార్ కృష్ణ సతీమణి విజయనిర్మల (73) కన్నుమూశారు. బుధవారం అర్ధరాత్రి  గచ్చిబౌలిలోని కాంటినెంటల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మరణించారు. గత కొంత కాలంగా విజయనిర్మల అనారోగ్యంతో  బాధపడుతున్నారు. ఈమేరకు ఆమెను గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్ లో చేర్పించి తికిత్స అందిస్తున్నారు. ఐతే నిన్న అర్ధరాత్రి గుండె పోటు రావడంతో ఆమె మరణించారు. విజయనిర్మల 1946 ఫిబ్రవరి 20న తమిళనాడులో జన్మించారు. ఏడేళ్ల వయసులో బాలనటిగా తమిళ చిత్రం మత్స్యరేఖతో సినీరంగ ప్రవేశం చేశారు. 11 ఏళ్ల వయసులో పాండురంగ మహత్యం సినిమాతో తెలుగు తెరకు ఆమె పరిచయమయ్యారు. విజయ నిర్మల మొదటి భర్త కృష్ణమూర్తితో విడిపోయిన తర్వాత సూపర్ స్టార్ కృష్ణను రెండవ పెళ్లి చేసుకున్నారు. ఆమెకు నరేష్ ఒక్కడే కుమారుడు. ప్రుఖ నటి జయసుధకు విజయ నిర్మల స్వయానా పిన్న.
vijaya nirmala
ప్రముఖ నటి విజయనిర్మల మృతిపట్ల ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి  ప్రకటించారు. విజయనిర్మల మృతి చెందారన్న వార్త తెలిసి ఎంతో విచారించానని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. బాలనటిగా తెలుగు సినీరంగంలో ప్రవేశించి ఉన్నతశిఖరాలు అధిరోహించారని అన్నారు. అటు విజయ నిర్మల మృతి పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు సంతాపం తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులకు ప్రగా సానుభూతి తెలియజేశారు.

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.