Newspillar
Newspillar
Tuesday, 27 Jun 2023 18:30 pm
Newspillar

Newspillar

ఢిల్లీ-హైదరాబాద్- త్వరలోనే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పు జరగబోతోందని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. బండి సంజయ్ ను అధ్యక్ష్య పదవి నుంచి తప్పించి బీజేపీ సీనియర్ నాయకురాలు డీకే అరుణకు పార్టీ పగ్గాలు అప్పజెప్పుతారన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతూ వస్తోంది. ఇదిగో ఇటువంటి సమయంలో తెలంగాణ పార్టీ అధ్యక్షుడి మార్పు పై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌ చుగ్ తేల్చి చెప్పారు. అది తప్పుడు ప్రచారమని కొట్టిపారేసిన తరుణ్ చుగ్.. ఈ సమయంలో అధ్యక్షుడు మార్పు ఎలా ఉంటుందని ప్రశ్నించారు. 

మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం సాయంత్రం బండి సంజయ్ కి ఫోన్ చేశారు. అధ్యక్షుడి మార్పుపై జరుగుతున్న ప్రచారాన్ని పట్టించుకోవద్దని సూచించారు. ఎప్పటిలాగే తెలంగాణలో బీఆర్ఎస్ పై పోరాటం కొనసాగించాలని, వచ్చే ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయాలని బండి సంజయ్ కు చెప్పారు అమిత్ షా. దీంతో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని మారుస్తున్నారన్న ప్రచారానికి తెరపడినట్టేనని తెలుస్తోంది.