Breaking News

>>పాపం.. దీపక్ రెడ్డి చాలా అమాయకుడట..                  >>పాపం.. దీపక్ రెడ్డి చాలా అమాయకుడట..                  >>సుష్మాస్వరాజ్ తో హాస్యమాడితే అలాగే ఉంటుంది....                  >>గెడ్డం మీసం తీసేసిన బాహుబలి..                  >>ప్రభాస్ తో తప్పింది.. పెళ్లి కుదిరింది....                  >>‘డీజే’లోనూ ఆయన హైలైట్ అయ్యేలా ఉన్నాడే...                  >>విప్రోను అమ్మేయడం లేదంటున్న ప్రేమ్ జీ..                 

Latest News

ఉపరాష్ట్రపతి గా మన సాగర్ జీ?

ఢిల్లీ : ఎన్ డి ఏ ఉప రాష్టపతి అభ్యర్థిగా తెలంగాణ బిడ్డకు అవకాశం దక్కే అవకాశం కనిపిస్తోంది. మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు పేరు ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఉప రాష్టపతి హమీద్ అన్సారీ పదవి కాలం ఆగష్టు 11 న ముగియనుంది. రాష్టపతి అభ్యర్థిగా ఉత్తరాదికి చెందిన గవర్నర్ కు అవకాశం దక్కగా... ఇప్పుడు ఉప రాష్టపతి అభ్యర్థి గా దక్షిణాదికి చెందిన మరో గవర్నర్ చెన్నమనేనికి అవకాశం కల్పించవచ్చని తెలుస్తోంది. సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం లోని నాగారం విద్యాసాగర్ రావు స్వగ్రామం... ఒక వేళ విద్యాసాగర్ రావు కు అవకాశం వస్తే ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన మొదటి వ్యక్తిగా రికార్డ్ కెక్కుతారు.

On Jun 25 ,2017

ఆ రెండు త‌ప్పులు చేయ‌క‌పోతే బోరు బావిలోని చిన్నారి బ‌తికేదే..

హైద‌రాబాద్ : వికారాబాద్ జిల్లా చేవెళ్ళ మండ‌లం చ‌నువెళ్ళి గ్రామ‌పంచాయితీ ప‌రిదిలో బోరు బావిలో ప‌డ్డ చిన్నారి చ‌నిపోయిన విష‌యం తెలిసిందే. చిన్నారిని కాపాడేందుకు రెస్క్యూ టీం దాదాపు 60 గంట‌లు శ్ర‌మించినా ఆప‌రేషన్ విషాదంతోనే ముగిసింది. అయితే చిన్నారి ప‌డిన‌ప్ప‌టినుంచి పోలీస్ అధికారులు, త‌ల్లి దండ్రుల‌తో స‌హా గ్రామ‌స్తులు చేసిన రెండు త‌ప్పులే చిన్నారి మీన ను డేంజ‌ర్ లోకి నెట్టాయ‌నేది స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. మిస్టెక్ 1 : చిన్నారి గుర‌వారం సాయంత్రం 6గంట‌ల 30 నిమిషాల‌కు బోరు బావిలో ప‌డిపోయింది. ప‌డిన 15 నిమిషాల‌కు విష‌యం త‌ల్లి దండ్రుల‌కు తెలిసింది. ఆందోళ‌న‌లో ఆ వూరి గ్రామ స‌ర్పంచ్‌, పొలం య‌జ‌మాని రాంరెడ్డి కి ఫోన్ చేసి చెప్పారు త‌ల్లి దండ్రులు. ప‌ది నిమిషాల‌లోపే గ్రామ‌స్తులు అక్క‌డికి చేరుకున్నారు. అప్పుడు చిన్నారి బోరుబావిలో 6 ఫీట్ల లోప‌ల ఉంది. పాప అక్క‌డ‌నే ఉండే తీయ‌టం చాలా సుల‌భం. కాని పాప ఏడుపుతో ఆందోళ‌న‌లో బోరులోని పైపును లాగితే పాప వ‌స్తుంద‌నే అంచ‌నాతో దాన్ని బ‌య‌టికి లాగారు. ఆ క‌ద‌లిక‌ల‌కు పాప 10 ఫీట్లు.. ఆ త‌ర్వాత 40 ఫీట్ల లోతున ఉన్న బోరు మోట‌రు వ‌ర‌కు జారిపోయింది. 6 ఫీట్ల లోప‌ల ఉంటే రెస్క్యూ టీంలు మూడు నాలుగు గంట‌ల లోపే పాప‌ను క్షేమంగా బ‌య‌టికి తీసేవాళ్ళు. మిస్టెక్ 2: చిన్నారి బోరు బావిలె మోట‌రుపైన ఉన్న‌ప్పుడు అంటే 40 ఫీట్ల లోప‌ల ఉన్న విష‌యాన్ని శుక్ర‌వారం 8 గంట‌ల స‌మ‌యంలో సీసీ టీవీ పుటేజీ ద్వారా ఎన్డీఆర్ ఎఫ్ సిబ్బందితో పాటు మంత్రి మ‌హేంద‌ర్ రెడ్డి, ఎంపీ విశ్వేశ్వ‌ర్ రెడ్డి లు గ‌మ‌నించారు. అప్ప‌టికే బోరుకు స‌మాంత‌రంగా 30 ఫీట్ల వ‌ర‌కు గోతిని తీశారు. మ‌రో 15 ఫీట్లు గోతిని త‌వ్వితే మోట‌రుపైన ఉన్న పాప‌ను ఈజీగా బ‌య‌టికి తీసే అవ‌కాశం ఉండేది. కాని మోట‌రును బ‌య‌టికి తీస్తే పాప కూడా బ‌య‌టికి వ‌స్తుంద‌ని పోలీసు అధికారులు అన్నారు. దీనికి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వ‌ద్ద‌ని వారించారు. బోరుకు కేసీన్ లేదు కాబ‌ట్టి పాప జారిపోయే ప్ర‌మాదం ఉంటుంద‌ని చెప్పారు. కాని ఇదే బెట‌ర్ ఐడియ పోలీసులు వాదించారు. దీంతో బోరులోని మోట‌రును బ‌య‌టికి తీశారు.ఎన్డీఆర్ఎఫ్ చెప్పిన‌ట్లుగానే పాప మ‌రింత లోతఉకు జారిపోయింది. ఈ రెండు త‌ప్పులు చేయ‌క‌పోతే చిన్నారి మీన ఖ‌చ్చితంగా ప్రాణాల‌తో బ‌య‌ట ప‌డేది. ఒక‌టి ఆందోళ‌ర‌న‌లో ఉన్న ఆ గ్రామ‌స్తులు.. రెండోది పోలీస్ ఉన్న‌తాదికారులు చేసిన త‌ప్పుల‌తో పేద దంప‌తులు ఏడాదిన్న‌ర చిన్నారిని కోల్పోయారనేది స్థానిక ప్ర‌జ‌లు అనుకుంటున్న మాట‌.

On Jun 25 ,2017

ఇదేం రోగం.. బెడ్ పైన వెంకయ్య యోగ

ఢిల్లీ : ఎవరైనా యోగ ఎక్కడ చేస్తారు.. ఎందుకు చేస్తారు.. ప్రశాంతత కోసం ఆరుబయట పాచికబయల్లో యోగ చేస్తారు. అయితే కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు మాత్రం అందుకు విరుద్ధం. బుధవారం అంతర్జాతీయ యోగా దివస్ సందర్బంగా ఢిల్లీ లో ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక గ్రౌండ్ లో అందరితో పాటే యోగ చేశారు. అయితే అందయూ మాములుగా నేల పైన యోగ మ్యాట్ లు వేసుకొని యోగ చేశారు. కానీ వెంకయ్య నాయుడు యోగ కోసం ప్రత్యేకంగా బెడ్ ఏర్పాటు చేశారు. అక్కడ యోగ చేస్తున్నవాళ్ళు వెంకయ్య నాయుడు యోగ చేస్తున్న తీరు చూసి అవాక్కయ్యారు. వెంకయ్య నాయుడా మజాకా అని నవ్వుకున్నారు.

On Jun 22 ,2017

చంద్ర‌బాబు విషయంలో రోజా చెప్పింది నిజ‌మేనా..! 

అమ‌రావ‌తి : హైటెక్ సిటి తెచ్చింది నేనే.. ప్ర‌పంచంలో హైద్రాబాద్ కు గుర్తింపు తెచ్చింది నేనే.. అనే చంద్ర‌బాబు., రాష్ట్ర విభ‌జ‌న తర్వాత  ఈ స్వ‌రాన్ని మ‌రింత పెంచారు. గ‌తంలో తాను చేసింది ప‌దే ప‌దే చెబుతు.. భ‌విష్య‌త్ లో దీనికి రెట్టింపు చేయ‌బోతున్నాన‌ని ప్ర‌చారం చేసుకుంటున్నారు. ఈదిశ‌లోనే ఆయ‌న ప‌దే ప‌దే ఏపీ.. అమ‌రావ‌తి గురించి చెబుతుండ‌టం మ‌నం చూస్తున్నాం. కూర్చోవ‌డానికి కుర్చీ లేదు.. ఉండ‌టానికి ఇల్లు లేదు.. అయినా ..నేను  ఏపిని అగ్ర రాష్ట్రంగా నిలుపుతా అని చెబుతున్న చంద్రబాబు..  ఏపీకి నేనే బ్రాండ్ ... సో.. ఇక రాష్ట్రం అభీవృద్దికి డోకాలేద‌ని బ‌రోసా ఇస్తున్నారు. అయితే ఇలా అంటున్న చంద్ర‌బాబును ఏకి పారేస్తున్నారు వైసీపీ నేతలు. అందులో ముఖ్యంగా ఆపార్టీ ఎమ్మెల్యే , సీని న‌టి  రోజా అయితే త‌న‌దైన సినిమా స్టైల్లో చంద్ర‌బాబును టార్గెట్ చేస్తున్నారు. చంద్ర‌బాబు బ్రాండ్ కాదు... అయ‌న  ఓ బ్యాండ్ బాబు అంటు సెటైర్లు గుప్పిస్తున్నారు. ఉన్న‌వి లేన‌ట్టు.. అంతా తానే చేశాన‌న్న‌ట్లు.. విదేశాలు తిరుగుతూ.. స్వంతంగా బ్యాండ్ వాయించు కుంటున్నార‌ని  ఎద్దేవా చేశారు రోజా.. మ‌రి రోజా కామెంట్స్ పై తెలుగు తుమ్ముళ్లు ఎ రేంజ్ లో కౌంట‌ర్ ఇస్తారో..!!!

On Jun 22 ,2017

మాట నిల‌బెట్టుకున్న కాంగ్రెస్ .. ద‌టీజ్ క‌మిట్‌మెంట్

పంజాబ్ ః కాంగ్రెస్ మాట నిల‌బెట్టుకుంది. పంజాబ్ రాష్ట్రంలో ఇచ్చిన మాట ప్ర‌కారం రైతుల‌కు రుణ‌మాఫీ చేసింది. ఇదే యేడాదిలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో రైతు రుణ‌మాఫీయే ప్ర‌ధాన వాగ్దానంగా ప్ర‌చారం చేసింది. అందులో బాగంగా సీఎం అమ‌రేంద‌ర్ సింగ్ రైతుల‌కు రుణ‌మాఫీ చేస్తూ ప్ర‌క‌ట‌న చేశారు. 2 ల‌క్ష‌ల లోపు రుణాల‌న్ని ఒకే ఒక ప్ర‌క‌ట‌న‌తో మాఫీ అయ్యాయి.ఈ ప్ర‌క‌ట‌నతో 10.25 ల‌క్ష‌ల మంది రైతులు ల‌బ్ది పొందారు. ఇదే రుణ‌మాఫీ చేస్తామంటూ తెలంగాణ‌లో అధికారంలోకి వ‌చ్చిన టీఆర్ఎస్‌..యూపీలో గెలిచిన మాట నిల‌బెట్టుకోలేక ఎన్ని ఇబ్బందులు ప‌డ్డాయో అంద‌రికి తెలిసిందే. తెలంగాణ లో నాలుగు విడ‌త‌లుగా 17వేల కోట్లు విడుద‌ల చేసి రుణ‌మాఫీ అయ్యింద‌ని ప్ర‌చారం చేసుకున్నా ఒక్క రైతుకు కూడా కొత్త రుణం రాని సంగ‌తి అంద‌రికి తెలిసిందే. ఇప్ప‌టివ‌ర‌కు స‌ర్కారు క‌ట్టింది ఇంట్ర‌స్ట్ త‌ప్ప రైతుల‌కు అస‌లు అప్పు అలాగే మిగిళింది . ఇక యూపీలో బీజీపీ రుణ‌మాఫీ చేసినా అక్క‌డి రైతులు అనేక ఆందోళ‌నలు చేసిన త‌ర్వాత కాని నిర్ణ‌యం తీసుకోక‌త‌ప్ప‌లేదు. ఇలాంటి క్లిష్ట ప‌రిస్థితుల్లో పంజాబ్ లో ఇచ్చిన మాట‌కోసం అమ‌రేంద‌ర్ సింగ్ స‌ర్కారు రుణ‌మాఫీ చేయ‌టం దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

On Jun 20 ,2017

వ్యవసాయ ప్రణాళిక లేకపోవడం దారుణం- పొంగులేటి

హైదరాబాద్- ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా సర్కార్ వద్ద వ్యవసాయ ప్రణాళిక లేకపోవడం దారుణమన్నారు సీయల్పీ డిప్యూటీ లీడర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి. రైతులు వ్యవసాయ పెట్టుబడులకు నా నా తంటాలు పడుతూ దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారని ఆయన ఆవేధన వ్యక్తం చేశారు. బ్యాంకులు ఎక్కడా రైతులకు వ్యవసాయ రుణాలు ఇవ్వడం లేదన్న పొంగులేటి.. గడ్డకట్టిన యూరియా ను ఎక్కువ ధరలకు మార్కుఫెడ్ రైతులకు అంటగడుతున్నా సర్కార్ కు పట్టడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా సర్కార్ స్పందించి రైతులను ఆదుకోవాలని పొంగులేటి విజ్ఞప్తి చేశారు. ఇక సింగరేణి వారసత్వ ఉద్యోగాలపై కేసీఆర్ హామీ గాలికొదిలేశారని పొంగులేటి మండిపడ్డారు. వారసత్వ ఉద్యోగాలపై సర్కులర్ ఇచ్చి పాలాభిషేకాలు చేయించుకున్న కేసీఆర్ ఇప్పుడెందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. సింగరేణి సమ్మెలో అక్రమ అరెస్ట్ లను ఆపాలన్న పొంగులేటి.. ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మిక సంఘాలతో చర్చలు జరపాలని సూచించారు.

On Jun 20 ,2017

సెల్ ఫోన్ ఉంటే సమాధి చేసినా బతికేయొచ్చు

సెల్ ఫోన్లు మనిషికి ఎన్నిరకాలుగా పనికొస్తున్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తాజాగా రష్యా రాజధాని మాస్కోలో ఓ వ్యక్తి ఏకంగా సమాధి నుంచి బయటపడి ప్రాణం పోసుకోవడంలోనూ సెల్ ఫోన్ సహకరించింది. వినడానికి వింతగా ఆశ్చర్యంగా ఉన్న ఈ సంఘటన గురించి తెలుసుకోవాల్సిందే. మాస్కోకు చెందిన ఖిక్ మెట్ అనే వ్యాపారి తన వ్యాపారం నిమిత్తం చాలామంది దగ్గర అప్పులు చేశాడు. వ్యాపారంలో నష్టాలు రావడంతో ఆయన చేసిన అప్పులు తీర్చలేకపోయారు. దీంతో ఆయనను దొరకబుచ్చుకున్న అప్పుల వాళ్లు చితకబాదారు. అంతటితో ఆగకుండా ఆగ్రహంతో నేలపై పెద్ద గుంత తవ్వి ఆయన్ను సజీవంగా పాతిపెట్టారు. అయితే... ఖిక్ మామూలోడు కాదు.. బుర్ర ఉపయోగించాడు. సమాధిలోంచే ఎలాగో ఒకలా వీలు చేసుకుని తన తన జేబులోని సెల్ ఫోన్ తీసి తన అన్న ఇస్మాయిల్ కు ఫోన్ చేసి సంగతంతా చెప్పాడు. అయితే... ఎక్కడ సమాధి చేశారో చెప్పకుండానే ఆ ఫోన్ కట్ అయింది. వెంటనే ఇస్మాయిల్ తన తమ్ముడికి అప్పులిచ్చినవారిని కాంటాక్ట్ చేయగా వారు వివరాలు చెప్పడానికి నిరాకరించారు. అప్పు తీరిస్తేనే చెప్తామన్నారు. దాంతో ఇస్మాయిల్ వారికి 1.2 మిలియన్ రూబుల్స్తో పాటు తన బీఎండబ్ల్యూ 535 మోడల్ కారును కూడా అప్పగించి ఎక్కడ సమాధి చేశారో కనుక్కున్నాడు.

On Jun 08 ,2017

పాపం.. దీపక్ రెడ్డి చాలా అమాయకుడట

భూఅక్రమాల కేసులో సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేసిన టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి తాను అమాయకుడినని చెప్పుకొస్తున్నారు. తనపై వచ్చిన ఆరోపణలతో తనకెలాంటి సంబంధం లేదని.. తన సంతకాలు ఫోర్జరీ చేశారని ఆయన అంటున్నారు. కాగా దీపక్ రెడ్డిని ఆయనకు సహకరించిన న్యాయవాది శైలేంద్ర సక్సేనాను పోలీసులు ఇప్పటికే చంచల్ గూడ జైలుకు తరలించారు.

On Jun 07 ,2017

 
 

Gallery