Newspillar
Newspillar
Thursday, 29 Jun 2023 18:30 pm
Newspillar

Newspillar

హైదరాబాద్- తెలంగాణలో భారతీయ జనతా పార్టీలో (Telangana BJP) పేను మార్పులు చోటుచేసుకోనున్నాయా? బీజేపీలో ఆధిపత్య పోరు నడుస్తున్న టైంలో.. కమలం పార్టీకి భారీ షాక్ (Big Shock) కొట్టబోతోందా? అంటే అవునేన అంటున్నాయి తాజా పరిణామాలు. మరీ ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఒకరిద్దరు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నాట్లు తెలుస్తోంది. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించినా గుర్తింపు లేదని ఆవేదన సదరు నేతలు వ్యక్తం చేస్తున్నట్లు పార్టీలో చర్చ జరుగోతంది. కొంత కాలంగా బీజేపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఓ ఎమ్మెల్యే త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటించడానికి సిద్ధపడుతున్నారన్న ప్రచారం ఉపందుకుంది.

కర్ణాటక (Karnataka) శాసనసభ ఎన్నికల రిజల్ట్స్ తర్వాత తెలంగాణ బీజేపీలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. తెలంగాణ సర్కార్ ను గద్దే దించుతామని సవాల్లు విసిరిన బీజేపీ నేతలు కర్ణాటక ఎన్నికల తరువాత డీలా పడిపోయారు. ఈ నేపధ్యంలో ప్రస్తుత బీజేపీ చీఫ్ బండి సంజయ్ (Bandi Sanjay), ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etela Rajender) మధ్య వర్గ విబేధాలు పెరిగాయి. రెండు వర్గాలుగా చీలిపోయిన నేతలు రహస్య సమావేశాలు ఏర్పాటు చేయడం వరకు వెళ్లింది. ఇలాంటి సమయంలో డీకే అరుణకు (DK Aruna) తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ఇస్తారన్న ప్రచారం పార్టీలో జోరుగా సాగుతోంది.

మరోవైపు బండి సంజయ్ కు కేంద్ర మంత్రి పదవి ఇస్తారని కూడా టాక్ ఉంది. ఇదిగో ఇటువంటి పరిస్థితుల్లో బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ట్విట్టర్ వేదికగా పోస్టు చేసిన వీడియోపై సంచలనం రేపుతోంది. మరోవైపు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు (MLA Raghunandan Rao) పార్టీ పెద్దల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతోన్నవారికి బీజేపీలో గుర్తింపు లేదని ఆవేదన చెందుతున్నారు. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు, పార్టీ కార్యాలయానికి అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తూ, సొంత నియోజకవర్గం దుబ్బాకలోనే ఉన్న రఘునందన్ రావు హఠాత్తుగా పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేయడం ఆసక్తికరంగా మారింది.