Newspillar
Newspillar
Monday, 03 Jul 2023 18:30 pm
Newspillar

Newspillar

ఇంటర్నేషనల్ డెస్క్- బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్‌కు (Shah Rukh Khan) అమెరికాలో ప్రమాదం జరిగిందని సమాచారం. లాస్‌ ఏంజిల్స్‌ లో ఓ సినిమా షూటింగ్ జరుగుతుండగా షారుక్‌ ప్రమాదానికి గురయ్యారని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో షారుక్ ఖాన్ ముక్కుకు గాయమైందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. డాక్టర్లు ఆయనకు శస్త్రచికిత్స చేశారని, ప్రమాదం ఏమీ లేదని తెలుస్తోంది. షారుక్ ఖాన్ ప్రస్తుతం ఇండియాకు తిరిగి వచ్చి, విశ్రాంతి తీసుకుంటున్నారని సమాచారం.

తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో జవాన్‌ సినిమాలో (Jawan) నటిస్తున్నారు షారుక్ ఖాన్. ఈ సినిమా సెప్టెంబర్‌ 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. షారుక్‌ ఖాన్ సరసన అంతాల భామ నయనతార నటిస్తుండగా, విజయ్‌ సేతుపతి, సన్యా మల్హోత్రా, ప్రియమణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అంతే కాదు ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్ దీపికా పదుకొణె కీలక పాత్రలో కనిపించబోతోంది. ఈ సినిమా కోసం షారుక్ ఖాన్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.