Newspillar
Newspillar
Tuesday, 04 Jul 2023 18:30 pm
Newspillar

Newspillar

హైదరాబాద్‌ స్పీడ్ న్యూస్- తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అధికారలను అలెర్ట్ చేశారు. ప్రధానంగా వర్షాకాలం నేపథ్యంలో అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ అధికారులను ఆదేశించారు. రానున్న రెండు రోజుల్లో హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో అంతర్గత విభాగాలతో పాటు ఇతర శాఖలతో కలిసి వర్షాల వల్ల ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కొనేందుకు సమన్వయంతో పనిచేయాలని కేటీఆర్ అధికారులకు సూచించారు. ముఖ్యంగా నగరంలో పారిశుద్ధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు చెప్పారు. 

ఇక జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇటీవల ప్రారంభించిన వార్డు కార్యాలయాల వ్యవస్థపై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. వార్డు కార్యాలయాలపై ప్రజల నుంచి వస్తున్న స్పందనను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వార్డు కార్యాలయాన్ని సందర్శించిన పలువురితో వారి వారి సమస్యలపై తాము స్వయంగా ఫోన్లో మాట్లాడామని కేటీఆర్ కు వివరించిన అధికారులు, వార్డు కార్యాలయం వ్యవస్థ పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని చెప్పారు. వార్డు కార్యాలయాలను ప్రజల్లోకి మరింతగా తీసుకుపోయేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు.