Newspillar
Newspillar
Sunday, 09 Jul 2023 00:00 am
Newspillar

Newspillar

స్పోర్ట్స్ న్యూస్- భారత స్టార్‌ షెట్లర్‌ పీవీ సింధుకు కెనడా ఓపెన్‌ సెమీ ఫైనల్లో పరాభవం ఎదురైంది. ఆదివారం ఉదయం జరిగిన సెమీఫైనల్లో జపాన్‌ కు చెందిన అకానే యమగుచి చేతిలో 14-21,15-21 తేడాతో పీవీ సింధు ఓటమి పాలైంది. రెండు గేమ్స్‌ లోనూ యమగుచి సింధుపై అధిపత్యం సాధించింది. పీవీ సింధు యమగుచి చేతిలో ఓడిపోవడం వరుసగా ఇది రెండో సారి.

కెనడా ఓపెన్ సెమీఫైనల్స్ లో పీవీ సింధు నిరాశపరిచినప్పటికీ మరో భారత షెట్లర్‌ లక్ష్య సేన్  అదరగొట్టాడు. కెనడా ఓపెన్‌ ఫైనల్లోకి  లక్ష్య సేన్ అడుగుపెట్టాడు. సెమీఫైనల్లో జపాన్‌ కు చెందిన కెంటా నిషిత్మోటోను 21-17, 21-14  వరుస గేమ్‌ లలో ఓడించి ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఈ విజయంతో  లక్ష్య సేన్  దాదాపు సంవత్సర కాలం తర్వాత బీడబ్ల్యూఎఫ్‌  వరల్డ్ టూర్ ఫైనల్‌కు చేరడం విశేషం.

ఇక గతంలో సింగపూర్‌ ఓపెన్‌-2023 లో తొలి రౌండ్‌ లోనే పీవీ సింధును ఈ జపాన్‌ స్టార్‌ షెట్లర్‌ యమగుచి ఓడించింది. గాయం నుంచి కోలుకున్న తర్వాత సింధు ముందులా ఆడలేకపోతోంది. తాజాగా బీడబ్ల్యూఎఫ్‌ ప్రకటించిన ర్యాంకింగ్స్‌ లోనూ మూడు స్ధానాలు దిగజారిన సింధు 15వ ర్యాంక్‌ లో నిలిచింది.