Newspillar
Newspillar
Monday, 10 Jul 2023 00:00 am
Newspillar

Newspillar

న్యూ ఢిల్లీ- బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) కేసు సోమవారం సుప్రీం కోర్టులో  విచారణకు రావాల్సి ఉందగా అనుకోకుండా వాయిదా పడింది. ఢిల్లీ లిక్కర్ కేసు (Delhi Liquor Scam) లో తనకు ఈడీ (ED) ఇచ్చిన సమన్లు రద్దు చేయాలని కోరుతూ కవిత సుప్రీం కోర్టును ఆశ్రయించింది. తనపై అరెస్ట్ లాంటి ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా ఈడీకి ఆదేశాలు ఇవ్వాలని సుప్రీం కోర్టును కోరారు కవిత. ఐతే అనుకోకుండా సుప్రీం కోర్టులో కోర్టు నంబర్ 2, 8 కార్యకలాపాలు రద్దయ్యాయి. 

జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ అందుబాటులో లేని కారణంగా  కోర్టు నంబర్ 2 కార్యకలాపాలు సోమవారం రద్దయ్యాయి. దీంతో కవిత కేసుకు సంబందించిన విచారణ సైతం వాయిదా పడింది. కోర్టు నంబర్ 2 ముందు లిస్ట్ అయిన కేసుల విచారణ ఈరోజు ఉండదని, విచారణను వాయిదా వేసినట్లు సుప్రీం కోర్టు ప్రకటించింది. జస్టిస్ ఎస్ రవీంద్ర భట్ అందుబాటులో లేకపోవడంతో కోర్టు నంబర్ 8 కార్యకలాపాలన్నీ రద్దయ్యాయి. కోర్టు నంబర్ 2, 8 లో రద్దైన కేసుల విచారణ తేదీలు త్వరలో తెలియజేయడం జరుగుతుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.