Newspillar
Newspillar
Wednesday, 12 Jul 2023 00:00 am
Newspillar

Newspillar

నేషనల్ రిపోర్ట్- దేశరాజధాని ఢిల్లీ (Delhi) లో యమునా (Yamuna) నది ప్రవాహం క్రమంగా పెరుగిపోతోంది. యమునా నది ప్రవాహం బుధవారం రికార్డ్‌ స్థాయిని దాటిందని అధికారులు చెప్పారు. ఉదయం 4 గంటల సమయంలో యమునా నది ఢిల్లీ ఓల్డ్ రైల్వే బ్రిడ్జ్‌ వద్ద 207 మీటర్ల మేర ప్రవహించగా, సాయంత్రం 4 గంటలకు వచ్చేసరిగా మరో 0.71 పెరిగి 207.71 గా మీటర్లకు పెరిగిందని సెంట్రల్ వాటర్ కమీషన్ (CWC) తెలిపింది.

యమునా ప్రవాహం అంతకంతకు పెరిగిపోతుండటంతో ఢిల్లీ మఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అలర్ట్ అయ్యారు. యమునా లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు త్వరగా ఖాలీ చేయించాలని సీఎం ఆధికారులను ఆదేశించారు. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సహాయ చర్యలు చేపట్టాలని చెప్పారు. మరోవైపు యమునా ప్రవాహాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు అరవింద్ కేజ్రీవాల్. ఈ క్రమంలో హర్యానాలోని హత్నీకుండ్ బ్యారేజ్‌ నుంచి నీటిని పరిమిత స్థాయిలో విడుదల చేయాలని కేంద్ర హూం మంత్రి అమిత్‌ షాకు లేఖ రాశారు.

1978 తరువాత రికార్డు స్థాయిలో 207.49 మీటర్లను దాటిందని అధికారులు తెలిపారు. యమునా నది ఉప్పొంగడంతో పరివాహక ప్రాంతానికి దగ్గరగా ఉన్న వేల మందిని ఇప్పటికే పునరావాస ప్రాంతాల్లోకి తరలించామని సీఎం కేజ్రీవాల్ చెప్పారు. అటు యమునా నదీ పరివాహక ప్రాంతాల్లో రాకపోకలపై అధికారులు ఆంక్షలు విధించారు.