Newspillar
Newspillar
Saturday, 15 Jul 2023 18:30 pm
Newspillar

Newspillar

స్పెషల్ రిపోర్ట్- సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు (Mahesh Babu) కుమార్తె ఘట్టమనేని సితార (Sitara Ghattamaneni) సోషల్ మీడియాలో సెలబ్రిటీగా అందరికి తెలుసు కదా. గత కొన్ని రోజులుగా సితార సైతం సినిమా రంగంలోకి ఎంట్రీ ఇవ్వబోతోందన్న ప్రచారం జరుగుతోంది. దీనిపై సితార స్వయంగా స్పందించింది. భవిష్యత్తులో తాను సినిమాల్లో నటిస్తానని, సినిమా రంగంలో తనకూ ఆసక్తి ఉందని చెప్పుకొచ్చింది సితార. సితార నటించిన పీఎంజే జ్యువెల్స్‌ యాడ్‌ షార్ట్‌ ఫిల్మ్‌ ప్రిన్సెస్‌ ప్రివ్యూను శనివారం బంజారాహిల్స్‌ లోని ఓ హోటల్‌లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తన తల్లి నమ్రతాతో కలిసి పాల్గొంది సితార.

పీఎంజే జ్యూవెల్స్ కు సంబందించిన షార్ట్‌ ఫిల్మ్‌ తో పాటు సితార కలెక్షన్స్‌ తో రూపొందించిన లుక్‌ బుక్‌ను విడుదల చేశారు. కమర్షియల్ యాడ్స్ లో నటించడంతో వచ్చిన తన తొలి పారితోషికాన్ని చారిటీ కోసం ఖర్చు చేశానని ఈ సందర్భంగా సితార చెప్పింది. అమ్మ, నాన్న తనతో బెస్ట్‌ ఫ్రెండ్స్‌ గా ఉంటారని, ఏ విషయమైనా వారితోనే పంచుకుంటానని చెప్పుకొచ్చింది సితార. న్యూయార్క్‌ లోని  టైమ్స్‌ స్క్వేర్‌ వేదికపై పీఎంజే జ్యువెల్స్‌ ఆధ్వర్యంలో సితార సిగ్నెచర్‌ కలెక్షన్స్‌ ప్రారంభించడం పట్ల తన తండ్రి మహేష్‌ బాబు ఎంతో సంతోషంగా ఉన్నారని తెలిపింది.

కూతురు సితార యాడ్‌ ఫిల్మ్‌ చూసినప్పుడు మహేష్‌ బాబు భావోద్వేగంతో కంటతడి పెట్టుకున్నారని నమ్రతా శిరోద్కర్‌ (Namratha Shirodkar) చెప్పారు. ఈ సందర్భంగా మీ అబ్బాయి గౌతమ్‌ సినిమాల్లోకి ఎప్పుడు వస్తారు.. అని నమ్రతను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. గౌతమ్‌ ప్రస్తుతం తన చదువుపై ఆసక్తిగా ఉన్నాడని, ఆరేడేళ్ల తర్వాత సినిమాల్లోకి వస్తాడని తెలిపారు నమ్రత.