Newspillar
Newspillar
Sunday, 16 Jul 2023 18:30 pm
Newspillar

Newspillar

స్పెషల్ రిపోర్ట్- ఇప్పుడున్న సమాజంలో ఎవరైనా డబ్బులు కావాలని కోరుకుంచారే తప్ప, వద్దని వదులుకునేవారు చాలా అరుదు. అందులోను తమ దగ్గర ఉన్న కోట్ల రూపాయలను వదిలేసి సాధారణ జీవితాన్ని ఎవరు కోరుకోరు. కానీ ఇందుకు మినహాయింపు రాజస్థాన్ (Rajasthan) కు చెందిన భన్వర్‌లాల్ రఘునాథ్ దోషి (Bhanwarlal Raghunath Doshi).

రాజస్థాన్‌ లో చిన్న వస్త్ర వ్యాపారి అయిన తన తండ్రి నుంచి 30,000 తీసుకుని ప్లాస్టిక్ వ్యాపారం మొదలుపెట్టాడు భన్వర్‌ లాల్‌. కొన్నెళ్లలోనే బిజినెస్ లో అంచెలంచెలుగా ఎదిగి తక్కువ సమయంలోనే ఢిల్లీ కింగ్‌ గా పేరుతెచ్చుకున్నాడు. సుమారు 600 కోట్ల రుపాయల సామ్రాజ్యానికి చక్రవర్తి అయ్యాడు భన్వర్‌ లాల్‌. చిన్నప్పటి నుంచే భన్వర్‌ లాల్‌ కు అధ్యాత్మికం అంటే ఎంతో మక్కువ.

ఈ క్రమంలోనే జైన మతాన్ని స్వీకరించాలని, మత బోధకుడిగా మారాలనే కోరికతో కోట్ల సామ్రాజ్యం వదులుకున్నాడు. ఆయన నిర్ణయం తెలిసి చాలా మంది ఆశ్చర్యపోయారు. అనుకున్న విధంగానే అహ్మదాబాద్‌ లో జరిగిన భారీ వేడుకలో, లక్షలాది మంది ప్రజల సమక్షంలో గుణరత్న సురిష్వరాజ్ జీ మహారాజ్ నుంచి శిష్యరికం పొందాడు భన్వర్‌ లాల్‌. ఈ వేడుకకు హాజరైన ప్రముఖ వ్యాపారవేత్త, అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ దోషిని ఘనంగా సత్కరించారు.