Newspillar
Newspillar
Friday, 21 Jul 2023 18:30 pm
Newspillar

Newspillar

ఇంటర్నేషనల్ రిపోర్ట్- బియ్యం ధరలను అదుపు చేసేందుకు బియ్యంపై నిషేధం (Rice export ban) విధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమెరికాలో (America) ఆందోళనకు కారణమైంది. దేశంలో బాస్మతియేతర బియ్యం ఎగుమతిపై నిషేధం విధించడంతో విదేశాల్లో ఉన్న భారతీయులు బియ్యం కోసం (Rice Shortage) షాపుల ముందు క్యూ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా అగ్ర రాజ్యం అమెరికాలో ఈ పరిస్థితి మరింత దారుణంగా కనిపిస్తోంది. బియ్యంపై కేంద్ర ప్రభుత్వం విధించిన నిషేదం గురించి తెలిసిన వెంటనే ధరలు పెరుగుతాయన్న ఆందోళనతో చాలా మంది ఎన్నారైలు ముందుగానే సూపర్‌ మార్కెట్ల ముందు క్యూ కట్టారు. 

 కేవలం అమెరికా  (USA) లోనే కాకుండా కెనడాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఆయా దేశాల్లో నివసించే భారతీయులు (NRI) ముఖ్యంగా అన్నం ఆహారంగా తీసుకునే దక్షిణ భారతానికి చెందిన వారు బియ్యం కొనుగోళ్లకు బారులుతీరడంతో చాలా స్టోర్ల వద్ద గందరగోళ పరిస్థితి ఏర్పడింది. కొందరు కొన్ని నెలలకు సరిపడే బియ్యాన్ని కొనుగోలు చేయడానికి కార్లలో స్టోర్లకు చేరుకున్నారు. దీంతో కొన్ని సూపర్ మార్కెట్స్ ముందు భారీ క్యూలైన్లు కనిపించాయి. మరికొన్ని చోట్ల బియ్యం కోసం సూపర్‌ మార్కెట్లో (Super markets) ప్రజలు ఎగబడుతున్న సీన్స్ కనిపించాయి. ఒక్కొక్కరు పదుల సంఖ్యలో రైస్‌ బ్యాగులను కార్లలో వేసుకెళుతున్నారు

అమెరికాలో ఇదే అదునుగా అక్కడి సూపర్‌ మార్కెట్లు బియ్యం ఎగుమతులపై నిషేధం నేపథ్యంలో కొన్ని స్టోర్లు ధరలను భారీగా పెంచేశాయి. 18 డాలర్లుగా ఉండే 20 పౌండ్ల బియ్యం బ్యాగ్‌ ధరను ఏకంగా 50 డాలర్లకు పెంచినట్లు పలువురు ఎన్నారైలు సోషల్ మీడియాలో ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని చోట్ల ఒకరికి ఒక రైస్ బ్యాగ్ మాత్రమే ఇస్తామంటూ కొన్ని స్టోర్లు నోటీసు బోర్డును ఏర్పాటు చేస్తున్నాయని వాపోతున్నారు ఎన్నారైలు.