Newspillar
Newspillar
Monday, 24 Jul 2023 18:30 pm
Newspillar

Newspillar

స్పెషల్ రిపోర్ట్- సాధారణంగా వర్షం పడినప్పుడు గ్రామాల్లో, అడవుల్లో పిడుగులు (Lightning Struck) పడటం సాధారణం. కానీ సిటీలో పిడుగు Thunderbolt) పడటం చాలా అరుదు. అవును హైదరాబాద్‌ (Hyderabad) లో పిడుగు పడటం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రాజేంద్రనగర్ (Rajendranagar) లోని అత్తాపూర్‌ (Attapur) లో నిన్న సోమవారం కురిసిని భారీ వర్షానికి ఓ నాలుగో అంతస్తు భవనం సమీపంలో పిడుగు పడింది. భారీ శబ్దంతో ఈ పిడుగు పడటంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.

అత్తాపూర్ డివిజన్ వాసుదేవరెడ్డి నగర్ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఐతే పిడుగు కారణంగా అపార్ట్మెంట్‌ లోని టీవీలు, ఫ్రిజ్‌లు, లిఫ్ట్‌ కాలిపోయాయి. పిడుగు పడిన దృష్యాలు సీసీ టీవీలో రికార్డయ్యాయి. ఇలా ఇళ్లపైన పిడుగులు పడటం చాలా అరుదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.