Newspillar
Newspillar
Monday, 24 Jul 2023 18:30 pm
Newspillar

Newspillar

స్పెషల్ రిపోర్ట్- బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యేకు తెలంగాణ హైకోర్టు (Telangana High Court) షాక్ ఇచ్చింది. కొత్తగూడెం (Kothagudem) ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు (Vanama Venkateshwara Rao) ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 2018 ఎన్నికల అఫిడవిట్‌ లో వనమా వెంకటేశ్వర్ రావు తప్పుడు సమాచారం ఇచ్చారంటూ ఆయనపై పోటీ చేసిన జలగం వెంకట్రావు (Jalagam Venkat Rao) హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం మంగళవారం తీర్పు వెలువరించింది. వనమా వెంకటేశ్వర్ రావు ను అనర్హుడిగా ప్రకటిస్తూనే ఆయన స్థానంలో ప్రస్తుత ఎమ్మెల్యేగా జలగం వెంకట్రావును ప్రకటించింది హైకోర్టు.   

తెలంగాణలో 2018లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కొత్తగూడెం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరఫున వనమా వెంకటేశ్వరరావు, టీఆర్ఎస్ (TRS) (ప్రస్తుతం బీఆర్ఎస్) తరఫున జలగం వెంకట్రావు ఎమ్మెల్యే అభ్యర్థులగా పోటీచేశారు. ఆ ఎన్నికల్లో వనమా విజయం సాధించి, ఆ తరువాత అధికార టీఆర్ఎస్ లో చేరిపోయారు. ఐతే వనమా వెంకటేశ్వర్ రావు ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ ఆయన ఎన్నికను సవాల్‌ చేస్తూ 2019లో జలగం వెంకట్రావు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. వనమాను అనర్హుడిగా ప్రకటించాలని పిటీషన్ లో కోరారు. సుదీర్ఘ విచారణ అనంతరం జలగం వెంకట్రావు వాదనలతో ఏకీభవించిన హైకోర్టు వనమా వెంకటేశ్వర రావు ఎన్నిక చెల్లదంటూ మంగళవారం తీర్పు వెలువరించింది. ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చారంటూ ఆయనకు 5లక్షల జరిమానాను కూడా విధించింది. 2018 ఎన్నికల్లో వనమా వెంకటేశ్వర రావు తరవవాతి స్థానంలో నిలిచిన జలగం వెంకట్రావ్ ను ఎమ్మెల్యేగా తమ తీర్పులో పేర్కొంది తెలంగాణ హైకోర్టు.