Newspillar
Newspillar
Monday, 24 Jul 2023 18:30 pm
Newspillar

Newspillar

ఫిల్మ్ రిపోర్ట్- మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) .. హిట్‌-2 (Hit 2) సినిమాతో సూపర్ హిట్‌ సొంతం చేసుకున్న హీరోయిన్.  ఆ సినిమా సక్సెస్ కావడంతో వరుస ఛాన్స్‌ లతో బిజీగా మారిపోయిందీ అందాల భామ. ప్రస్తుతం గుంటూరు కారంలో నటిస్తోంది మీనాక్షి చౌదరి. తన కెరీర్‌ ప్రారంభంలోనే మంచి సినిమాల్లో అవకాశాలు రావడం సంతోషంగా ఉందని చెప్పింది. తాను చాలా స్క్రిప్టులు వింటున్నానని, కథల ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నానని చెప్పుకొచ్చింది. 

ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలు చేయాలని ప్రయత్నిస్తున్నట్లు చెప్పింది మీనాక్షి చౌదరి. తెలుగు ప్రేక్షకులు తనను ఎంతో ఆదరిస్తున్నారని, ఏ భాషలో అయినా గొప్ప సినిమాల్లో అవకాశం వస్తే అది తనకు దక్కిన గౌరవమేనని అంది. ప్రస్తుతం తెలుగులో మూడు సినిమాల్లో నటిస్తున్నానని చెప్పింది మీనాక్షి చౌదరి.

ఇక సినిమాల్లో రొమాంటిక్‌ సీన్స్ లో నటించడంపై మీనాక్షి చౌదరి ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. తనకేదైనా ఇబ్బందిగా అనిపిస్తే అలాంటి సన్నివేశాల్లో నటించనని మొహమాటం లేకుండా చెప్పేసింది. అలా తనకు నచ్చని సీన్స్ ఉన్న చాలా సినిమాల్లో అవకాశాలొచ్చినా తిరస్కరించానని అంది. ఐతే కథకు అవసరమైతే ముద్దు సన్నివేశాల్లో నటించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పుకొచ్చింది మీనాక్షి చౌదరి. 

అదే సమయంలో అశ్లీల సన్నివేశాల్లో అసలు నటించకూడదని నిర్ణయించుకున్నట్లు చెప్పింది. కొత్త పాత్రల్లో నటించే అవకాశం వస్తే వెనకాడనని, విభిన్న పాత్రల్లో నటించాలనేదే తన ప్రయత్నమని తెలిపింది మీనాక్షి చౌదరి. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్‌ బాబు (Mahesh Babu) మూవీ గుంటూరు కారం (Guntur Karam) తో పాటు విశ్వక్ సేన్, వరుణ్‌ తేజ్‌ సినిమాల్లో నటిస్తోంది. తమిళ్ లో విజయ్ ఆంటోని నటించిన హత్య సినిమాలో కీలక పాత్రలో నటించిన మీనాక్షినటనకు మంచి మార్కులే పడ్డాయి.