Newspillar
Newspillar
Tuesday, 25 Jul 2023 18:30 pm
Newspillar

Newspillar

స్పెషల్ రిపోర్ట్- రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరపి లేకుండా వర్షం (Heavy Rains) కురుస్తోంది. నాన్ స్టాప్ గా పడుతున్న వానలతో భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలోని భద్రాచలం (Bhadrachalam) వద్ద గోదావరికి వరద పోటెత్తుతోంది. గంట గంటకు గోదావరి (Godavari River) నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. బుధవారం మధ్యాహ్నం 3 గంటల వరకు 44.4 అడుగుల మేర నీరు చేరినట్లు అధికారులు చెప్పారు. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గోదావరి నీటిమట్టం మరో నాలుగు అడుగులు పెరిగి 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. భద్రాచలం వద్ద గోదావరి నుంచి 9,92,794 క్యూసెక్కుల వరద దిగువకు ప్రవహిస్తోంది. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ నేపథ్యంలో అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.

అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరించారు. ఇక తాలిపేరు ప్రాజెక్టు (Taliperu Project) లోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతుండటంతో దిగువప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ ప్రియాంక (Collecter Priyanka) చెప్పారు. భద్రాచలం చర్ల రోడ్డుపై రాకపోకలు నియంత్రించాలని స్పష్టం చేశారు. తాలిపేరు నుంచి దిగువకు 2 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. లోతట్టుప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు కలెక్టర్ ప్రియాంక. ముంపుప్రాంత గ్రామాలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని అధికారులను ఆదేశించారు.