Newspillar
Newspillar
Wednesday, 26 Jul 2023 00:00 am
Newspillar

Newspillar

ఇంటర్నేషనల్ రిపోర్ట్- తెలంగాణ (Telangana) యువతి అగ్ర రాజ్యం అమోరికా (America) లో ధీన స్థితిలో ఉండటాన్ని చూసి అంతా చలించిపోతున్నారు. అమెరికాలో మాస్టర్స్‌ చదవాలని తెలంగాణ నుంచి వెళ్లిన ఓ మహిళ షికాగో (Chicago) రోడ్లపై ఆకలితో అలమటిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న ఆమె తల్లి తన కూతురును వెంటనే తీసుకురావాలని కోరుతూ కేంద్ర విదేశాంగ మంత్రి జై శంకర్‌ (Jai Shankar) కు లేఖ రాశారు. ఈ లేఖను బీఆర్ఎస్ నాయకుడు ఖలీకర్‌ రెహమాన్‌ తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేశారు.

అసలేంజరిగిదంటే.. హైదరాబాద్‌ (Hyderabad) లోని మౌలాలికి చెందిన సయ్యదా లులు మిన్హాజ్ జైదీ  (Syeda Lulu Minhaj Zaidi) మాస్టర్స్‌ చదువుకునేందుకు 2021 ఆగస్టులో అమెరికాకు వెళ్లింది. అక్కడికి వెళ్లిన సయ్యదా రెగ్యులర్ గా తల్లి సయ్యదా వహాజ్ ఫాతిమాతో ఫోన్లో మాట్లాడుతూ ఉండేది. ఐతే ఏంజరిగిందో తెలియదు కాని రెండు నెలలుగా కూతురు నుంచి ఎలాంటి స్పందన లేదు. హైదరాబాద్‌ నుంచి అమెరికాకు వెళ్లిన కొందరు ఆమెను గుర్తుపట్టి తల్లికి సమాచారం అందించారు. ఆమెకు సంబందించిన వస్తువులను ఎవరో దొంగలించారని, దీంతో చికాగో రోడ్లపై ఆకలితో అలమటిస్తోందని తల్లికి తెలియజేశారు. లులు మిన్హాజ్ మానసిక ఒత్తిడికి లోనవుతున్నట్లు కూడా చెప్పారు. దీంతో తీవ్ర ఆవేధనకు లోనైన తల్లి వహాజ్ ఫాతిమా తన కూతురిని తిరిగి భారత్‌ తీసుకురావాలని కేంద్రమంత్రికి లేఖ రాసింది. ఆమె లేఖఖు స్పందించిన కేంద్ర మంత్రి జై శంకర్ సానుకూలంగా స్పందించారు.