Newspillar
Newspillar
Sunday, 30 Jul 2023 18:30 pm
Newspillar

Newspillar

మూవీ రిపోర్ట్- తెలుగు ఫిలిం ఛాంబర్ (Telugu Film Chamber) ఎన్నికలు మూగిశాయి. ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ (Dil Raju) తెలుగు ఫిలిం ఛాంబర్ (TFC) అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. తెలుగు ఫిలిం ఛాంబర్ కు జరిగిన ఎన్నికల్లో మొత్తం 48 ఓట్లలో దిల్ రాజుకి 31 ఓట్లు రావడంతో ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లోని ఫిల్మ్‌ ఛాంబర్‌ కార్యాలయంలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు పోలింగ్‌ జరిగింది. ఆదివారం జరిగిన ఎన్నికల్లో నిర్మాత దిల్‌ ‪‌రాజు, మరో నిర్మాత సి.కల్యాణ్‌ (C Kalyan) ప్యానల్స్ మధ్య పోటీ నెలకొంది.

మొత్తం 14 రౌండ్స్‌లో 891 ఓట్లు పోల్‌ కాగా 563 ఓట్లు దిల్‌ రాజుకు,  497 ఓట్లు సి.కల్యాణ్‌‌కు పడ్డాయి. ప్రొడ్యూసర్స్ సెక్టార్‌ లోని 12 మందిలో దిల్‌ రాజు ప్యానల్‌ నుంచి ఏడుగురు ఎన్నికయ్యారు. స్టూడియో సెక్టార్ నుంచి గెలిచిన నలుగురిలో ముగ్గురు దిల్‌రాజు ప్యానల్‌, డిస్ట్రిబ్యూషన్ సెక్టార్‌లో ఇరు ప్యానల్స్‌లో చెరో ఆరుగురు గెలిచారు.  వైస్ ప్రెసిడెంట్ గా ముత్యాల రామదాసు, కార్యదర్శిగా దామోదర్ ప్రసాద్, ట్రెజరర్‌ గా ప్రసన్న కుమార్ ఎన్నికయ్యారు.