Newspillar
Newspillar
Monday, 31 Jul 2023 00:00 am
Newspillar

Newspillar

తిరుపతి స్పెషల్ రిపోర్ట్- కలియుగ ప్రత్యక్ష్య దైవం తిరుమల (Tirumala) శ్రీనివాసుడికి ఈ సారి రెండు బ్రహ్మోత్సవాలు (Annual Brahmotsavam) నిర్వహించనున్నారు. ఇందుకు సంబందించి భక్తులకు ఆసక్తి నెలకొంది. శ్రీవారి సన్నిధిలో బ్రహ్మ స్వయంగా తిరుమలకు విచ్చేసి శ్రీ వేంకటేశ్వర స్వామికి (Lord Venkatesha) నిర్వహించే ఉత్సవాలను బ్రహ్మోత్సవాలు అంటారు. ప్రతి మూడు సంవత్సరాలకు అధికమాసం రావడంతో ఈ సంవత్సరం రెండు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.

ప్రతి సంవత్సరం నిర్వహించే వార్షిక బ్రహ్మోత్సవాలను సాలకట్ల బ్రహ్మోత్సవాలు అని అంటారు. ఐతే ఈ యేడాది అధిక మాసం కారణంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు సైతం ఉంటాయి. సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం జరిగినట్టే జరుగనుండగా, నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణ, ధ్వజావరోహణాలు మాత్రం ఉండవు.  ఈ బ్రహ్మోత్సవాల ప్రశస్తిని అన్నమాచార్యులు.. నానా దిక్కుల నరులెల్లా.. అని తన సంకీర్తనల్లో వినసొంపుగా ఆలపించారు. ఆరోజుల్లోనే వేలమంది భక్తులు శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తరలివచ్చేవారని చెబుతున్నారు. అందుకే.. వీధుల వీధుల విభుడేగేనిదె.. అంటూ తిరుమాడవీధుల్లో శ్రీ మలయప్పస్వామి దర్శనభాగ్యాన్ని అన్నమయ్య భక్తిశ్రధ్దలతో కొలిచాడు. Tirumala Tirupati Devastanams