Newspillar
Newspillar
Wednesday, 02 Aug 2023 18:30 pm
Newspillar

Newspillar

మూవీ రిపోర్ట్- దర్శకధీరుడు ఎస్ ఎస్  రాజమౌళి (Rajamouli) సినిమా  అంటే తెలుగు రాష్ట్రాలే కాదు, దేశం, ప్రపంచవ్యాప్తంగా అందరిలో ఆసక్తి నెలకొంటుంది. అలాంటిది రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబ (Mahesh Babu) కాంబినేషన్ లో సినిమా అంటే ఆ క్రేజ్ అంతా ఇంతా కాదు. రాజమౌళి, మహశ్ బాబుతో సినిమా చేస్తున్నట్లు తెలుసు కానీ, అందుకు సంబందించిన అప్‌డేట్స్ మాత్రం ఇంకా బయటకు రాలేదు. ఐతే సినిమా ఇండస్ట్రీలో ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ గురించిన ఓ అప్ డేట్ వైరల్ అవుతోంది. మహేశ్‌ బాబు పుట్టినరోజు నాడు ఈ మూవీకి సంబందించి ఓ న్యూస్ షేర్‌ చేయనున్నారని సోషల్ మీడియాలో వార్త హల్ చల్ చేస్తోంది.

మహేశ్‌ బాబు పుట్టినరోజు ఈ నెల 9వ తేదీ ఘనంగా జరగబోతోంది. ఈ సందర్భంగా రాజమౌళి సర్‌ ప్రైజ్‌ ప్లాన్‌ చేశారని ఫిల్మ్ నగర్ లో ప్రచారం జరుగుతోంది. ఇంకేముంది మహేష్ బాబు అభిమానులు సంబరపడిపోతున్నారు. ఈ సినిమా టైటిల్‌ ను లేదంటే సినిమాలో మహేశ్‌ బాబు లుక్‌ ను రివీల్‌ చేస్తారని అంటున్నారు. మొన్న మహేశ్‌ షేర్‌ చేసిన లండన్‌ ట్రిప్‌ ఫొటోల్లో ఆయన లుక్‌ కొత్తగా ఉండటంతో, రాజమౌళి సినిమా కోసం అలా రెడీ అయ్యారని అభిమానులు చెప్పుకుంటున్నారు. అన్నట్లు మహేశ్‌ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్‌ శ్రీనివాస్ (Trivikram) డైరెక్షన్ లో గుంటూరు కారం (Guntur Karam) సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. గుంటూర్ కారంలో మహేశ్‌ సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) నటిస్తున్నారు.