Newspillar
Newspillar
Monday, 07 Aug 2023 18:30 pm
Newspillar

Newspillar

తెలంగాణ రిపోర్ట్- తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు కల్వకుంట్ల చంధ్రశేఖర్ రావు (CM KCR) వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ (Gajwel) నుంచి పోటీ చేయడం లేదా? రాష్ట్రంలోని మరో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపధ్యంలో గజ్వేల్ నుంచి కాకుండా మరో నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు కేసీఆర్ కసరత్తు చేస్తున్నారన్న చర్చ బీఆర్ఎస్ వర్గాల్లో జరుగుతోంది. ఓ వైపు ఈ చర్చ జరుగుతుండగా ఇందుకు బలం చేకూరుస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. 

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి (Kamareddy) నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ను తాను ఆహ్వానించినట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ (Gampa Govardhan) చెప్పారు. సీఎం సొంత గ్రామం కోనాపూర్ (Konapur) కామారెడ్డి నియోజకవర్గంలోనే ఉందన్న గోవర్ధన్, కేసీఆర్‌ ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తే నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఐతే  ఓటమి భయంతో తాను ఈ ప్రతిపాదన చేయడం లేదని, కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ది కోసమే కేసీఆర్ ను ఆహ్వానిస్తున్నానని వ్యాఖ్యానించారు. ఇప్పుడు బీఆర్ఎస్ తో పాటు తెలంగాణ రాజకీయాల్లో ఈ టాపిక్ వైరల్ అవుతోంది.