Newspillar
Newspillar
Friday, 11 Aug 2023 18:30 pm
Newspillar

Newspillar

ఇంటర్నేషనల్ రిపోర్ట్- రష్యా (Russia) సుదీర్గసమయం తరువాత సుమారు 50 ఏళ్ల తరువాత చంద్రుడిపైకి ఒక ల్యాండర్‌ ను పంపించింది. రష్యాలోని మాస్కోకు తూర్పున 3,450 మైళ్ల దూరంలోని వోస్తోక్నీ కాస్మోడ్రోమ్‌ ప్రాంతంలో సోయుజ్‌-2 ఫ్రిగట్‌ (Soyuz 11 Fright) రాకెట్‌ ద్వారా లూనా-25 (Luna 25) అనే ఈ ల్యాండర్‌ ను ప్రయోగించింది. ఈ ల్యాడర్ ఈ నెల 23న చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగే ఛాన్స్ ఉంది. ఇండియా ప్రయోగించిన చంద్రయాన్‌-3 (Chandrayaan-3) సైతం అదే రోజున సాయంత్రం 5.47 గంటలకు, అదే దక్షిణ ధ్రువంపై ల్యాండ్‌ కాబోతుండటం ఉత్కంఠ రేపుతోంది. చందమామపై ఇప్పటివరకూ అమెరికా, చైనా, రష్యా దేశాలు మాత్రమే సక్సెస్ ఫుల్ గా వ్యోమనౌకలను దించగలిగాయి.

ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏటంటే ఇప్పటివరకు చంద్రుడి దక్షిణ ధ్రువంపై ఒక్క ల్యాండర్‌ కూడా దిగలేదు. దీంతో ఆ ఘనత సాధించే మొదటి దేశంగా రికార్డు సృష్టించాలని భారత్‌, రష్యాలు పోటీపడుతున్నాయి. ఐతే రష్యా ప్రయోగించిన లూనా-25 ల్యాండింగ్‌ తేదీ, సమయం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. రష్యా 1976లో ఆఖరిసారి చంద్రుడిపైకి వ్యోమనౌకను పంపింది. ఇన్నళ్ల తరువాత ఇప్పుడు నింగిలోకి దూసుకెళ్లిన లూనా-25 ల్యాండర్ ఐదున్నర రోజుల్లో జాబిల్లికి చేరువవుతుంది. ఆ తర్వాత 3 నుంచి 7 రోజుల పాటు చంద్రుడి 100 కిలోమీటర్ల కక్ష్యలో పరిభ్రమించి, చివరికి దక్షిణ ధ్రమువంపై  ల్యాండింగ్‌కు సిద్ధమవుతుంది. ఇది చందమామ శిలలు, ధూళి నమూనాలను సేకరించి, పరిశోధించనుంది. ఇందుకోసం లూనా-25 లో రోబోటిక్‌ చేతులు, డ్రిల్లింగ్‌ హార్డ్‌ వేర్‌ ను అమర్చారు.