Newspillar
Newspillar
Friday, 11 Aug 2023 18:30 pm
Newspillar

Newspillar

న్యూ ఢిల్లీ-బెంగళూరు రిపోర్ట్- తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) వ్యవహారాలపై పార్టీ అధిష్టానం ప్రత్యేకంగా దృష్టి సారించింది. కర్ణాటక (Karnataka) ఎన్నికల్లో విజయం తర్వాత తెలంగాణపై గట్టి నమ్మకంగా ఉన్న ఢిల్లీ నేతలు, మరింత సమర్థంగా ముందుకెళ్లేందుకు నిర్ణయాలు తీసుకుంటున్నారు. తెలంగాణలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రచారానికి సంబందించిన బాధ్యతలను పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi), కర్ణాటక పీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ (DK Shivakumar) లకు అప్పగిస్తూ కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకొన్నట్లు సమాచారం. తెలంగాణ కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి, ఏఐసీసీ (AICC) కార్యదర్శులు ఇప్పటికే రాష్ట్రంలో తమ కార్యక్రమాలను కొనసాగిస్తుండగా, వీరికి తోడు ఏఐసిసి ప్రియాంక, డీకే లను కేటాయించడం పార్టీ వర్గాల్లో ఆసక్తిరేపుతోంది.

ఇక ముందు కాంగ్రెస్‌ అధిష్ఠానం తరఫున ప్రియాంక గాంధీ, డీకే శివకుమార్‌ లు రాష్ట్ర పార్టీకి సంబంధించిన అన్ని కీలక అంశాల్లోనూ నిర్ణయాలు తీసుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరీ ముఖ్యంగా నాయకులు కలిసి కట్టుగా పనిచేయడం, సమన్వయంతో ముందుకెెళ్లడం, ఎన్నికల్లో ప్రత్యర్ధి పార్టీలను చిత్తు చేయడం వంటి వ్యూహాల్లో ప్రియాంక, డీకే కీలకపాత్ర పోషించనున్నారని తెలుస్తోంది. ఎన్నికల సమయంలో తెలంగాణలో సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, మల్లిఖార్జున ఖర్గేలు ప్రచారంలో భాగంగా భహిరంగ సభలు నిర్వహించినా, మిగతా  వ్యవహారాలన్నీ వీళ్లిద్దరే చూసుకుంటారని సమాచారం. TPCC