Newspillar
Newspillar
Sunday, 13 Aug 2023 18:30 pm
Newspillar

Newspillar

మూవీ రిపోర్ట్- సూపర్ స్టార్ రజనీకాంత్‌ (Rajinikanth) తాజా మూవీ జైలర్ (Jailer) సక్సెస్ ఫుల్ గా ప్రదర్శించబడుతోంది. ఈసినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. దీంతో రజనీకాంత్ ప్రస్తుతం ఆధ్యాత్మిక యాత్రలోఉన్నారు. ఇటీవల హిమాలయాలకు వెళ్లిన రజనీకాంత్తాజాగా బద్రీనాథ్‌ ఆలయాన్ని సందర్శించారు. ఆదివారం తెల్లవారుజామున బద్రీనాధ్ ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుడి ప్రాంగణంలో అభిమానులకు అభివాదం చేసి, వారితో కాసేపు ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలోహల్ చల్ చేస్తున్నాయి. 

రజనీకాంత్ శనివారం రిషికేష్‌ లోని స్వామి దయానంద గురూజీ ఆశ్రమాన్నిసందర్శించారు. స్వామి దయానంద (Swamy Dayananda) దర్శనం తరువాత.. సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది.. అనిస్వామీజీ చెప్పారని, ఆయనే స్వయంగా ఆ మాట చెప్పారంటే తప్పకుండా జైలర్‌ హిట్‌ అయినట్టే.. అని రజనీకాంత్ అన్నారు. నెల్సన్‌ దిలీప్‌ కుమార్ (Nelson Dilipkumar) దర్శకత్వంలో రజనీకాంత్‌ నటించిన మూవీ జైలర్‌ (Jailer). ముత్తు అలియాస్ ముత్తువేల్ పాండ్య‌న్ (Rajinikanth) అనే రిటైర్డ్ పోలీస్ అధికారి పాత్రలో ఆయన నటించారు. గురువారం ఆగష్టు 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా హిట్‌ టాక్‌ అందుకుంది. కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల రూపాయలు వసూళ్లు చేసిందని బాక్సాఫీస్ లెక్కలు చెబుతున్నాయి.